Poco F6 స్పెషల్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ విడుదల.. స్పెసిఫికేషన్‌లు, ధర, సేల్ పూర్తి వివరాలు..!
పోకో F6 డెడ్‌పూల్ లిమిటెడ్ లిమిటెడ్ ఎడిషన్ ఇవాళ విడుదల అయింది. మార్వెల్ స్టూడియో భాగస్వామ్యంతో ఈ స్పెషల్ ఎడిషన్‌ను లాంచ్ అయింది. డెడ్‌పూల్ ప్రాంచైజీలోని మూడో చిత్రం డెడ్‌పూల్ అండ్ వుల్వరైన్ (Deadpool & Wolverine) విడుదల సందర్భంగా ఈ స్మార్ట్‌ఫోన్ ను (Poco F6 Deadpool Limited Edition Smartphone) అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్ వెనుక వైపు రెడ్ మరియు బ్లాక్ రంగుల్లో మరియు ప్రత్యేక లోగోతో విడుదల అయింది. ఈ హ్యాండ్ సెట్ స్పెషల్ ఎడిషన్ ఛార్జర్ ను కలిగి ఉంటుంది.
పోకో F6 డెడ్‌పూల్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
పోకో F6 డెడ్‌పూల్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ (Poco F6 Special Edition Smartphone) 6.67 అంగుళాల 1.5k అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీప్రెష్ రేట్, 2400 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ తో అందుబాటులోకి వచ్చింది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరెల్లా గ్లాస్ విక్టస్ రక్షణను పొందుతుంది.

ఈ హ్యాండ్ సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS ను కలిగి ఉంటుంది. మరియు 4nm స్నాప్ డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 12GB LPDDR5x ర్యామ్, 256GB UFS 4.0 తో జతచేయబడి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ కేవలం 12GB ర్యామ్ 256GB స్టోరేజీ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.
ఈ పోకో స్పెషల్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ 50MP OIS ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరాను కలిగి ఉంటుంది. అదే ముందువైపు 20MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ ఏఐ ఇమేజ్ Expansion, ఏఐ బొకేష్, మేజిక్ ఎరేజర్ ప్రో, మేజిక్ కటౌట్ సహా అనేక ఫీచర్లను కలిగి ఉంటుంది.
కనెక్టివిటీ పరంగా ఈ స్మార్ట్ ఫోన్ బ్లూటూత్ 5.4, వైఫై 6, NFC, IR సెన్సార్, USB-C ఫీచర్లను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ IP64 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా రానుంది. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో అందుబాటులోకి వచ్చింది.
పోకో F6 డెడ్‌పూల్ ఎడిషన్ స్మా్ర్ట్‌ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర 33,999 గా ఉంది. బ్యాంకు ఆఫర్లతో కలిపి ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.29,999 కే కొనుగోలు చేయవచ్చు. ఈ స్పెషల్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్టు 7వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








