Home
Mobile

Poco F6 Deadpool పోకో నుంచి లిమిటెడ్‌ ఎడిషన్‌ స్మార్ట్‌ఫోన్‌.. రేపు విడుదల.. పూర్తి వివరాలు..!

పోకో నుంచి త్వరలో కొత్త వేరియంట్ విడుదల కానుంది. పోకో F6 డెడ్‌పూల్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌ స్మార్ట్‌ ఫోన్‌ Poco F6 Deadpool Limited Edition Smartphone) జులై 26 విడుదల కానుంది. డెడ్‌పూల్‌ ప్రాంచైజీలోని మూడో చిత్రం డెడ్‌పూల్‌ అండ్‌ వుల్వరైన్‌ (Deadpool & Wolverine) విడుదలకు ముందు ఈ హ్యాండ్‌ సెట్‌ లాంచ్‌ కానుంది. ఈ ప్రత్యేక ఎడిషన్‌ స్మార్ట్‌ ఫోన్ దేశవ్యాప్తంగా మార్వేల్‌ ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని కలిగిస్తుందని భావిస్తున్నారు.

పోకో లిమిటెడ్‌ ఎడిషన్ స్మార్ట్‌ ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు. పోకో F6 స్టాండర్డ్‌ వేరియంటే కంటే ప్రత్యేకమైన ఫీచర్లు ఏమైనా కలిగి ఉంటుందా లేదా అనే వివరాలు వెల్లడించలేదు. స్టాండర్డ్‌ మోడల్‌ తరహా ఫీచర్లనే కలిగి ఉండే అవకాశం ఉంది. అయితే స్టాండర్డ్ వేరియంట్ ప్రారంభ ధర రూ.29,999 గా ఉండగా.. లిమిటెడ్‌ ఎడిషన్ మాత్రం అంతకంటే ఎక్కువ ధరను కలిగి ఉండే అవకాశం ఉంది.

Poco F6 Deadpool Limited Edition Smartphone

పోకో F6 5G స్మార్ట్‌ ఫోన్‌ 120Hz రీప్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల 1.5k అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరెల్లా గ్లాస్‌ విక్టస్‌ రక్షణను పొందుతుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 4nm స్నాప్‌ డ్రాగన్‌ 8s జెన్‌ 3 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. మరియు ఆండ్రాయిడ్‌ 14 Hyper OS ను కలిగి ఉంటుంది.

ఈ చిప్‌ సెట్‌ 12GB LPDDR5x ర్యామ్‌, 512GB UFS 4.0 తో జతచేయబడి ఉంటుంది. 8GB ర్యామ్‌ + 256GB అంతర్గత స్టోరేజీ, 12GB ర్యామ్‌ + 256GB అంతర్గత స్టోరేజీ, 12GB ర్యామ్‌ + 512GB అంతర్గత స్టోరేజీ లో అందుబాటులో ఉంది.

ఈ హ్యాండ్‌ సెట్ వెనుకవైపు OIS (ఆప్టికల్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌), EIS (ఎలక్ట్రానిక్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP 1/1.9 అంగుళాల సోనీ IMX882 కెమెరాను కలిగి ఉంది. మరియు 8MP సోనీ IMX355 అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరాను అమర్చారు. దీంతోపాటు 20MP OV20B సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది.

ఈ పోకో F6 స్టాండర్డ్‌ వేరియంట్‌ 90W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. దీంతోపాటు ఈ స్మార్ట్‌ ఫోన్‌ Iceloop కూలింగ్‌ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఫలితంగా ఫోన్‌ ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచుతుంది. IP64 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌, డాల్బీ అట్మాస్ సపోర్టుతో హైబ్రిడ్‌ డ్యూయల్‌ స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది.

కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్‌ సెట్‌ 5G, వైఫై 6, బ్లూటూత్ 5.4, USB-C ఛార్జింగ్ పోర్టు సహా అనేక ఫీచర్లను కలిగి ఉంటుంది. దీంతోపాటు యాక్సెలిరో మీటర్‌, యాంబియంట్ లైట్‌ సెన్సార్, ఈ-కాంపాస్, గైరోస్కోప్‌, IR బ్లాస్టర్‌, ప్రాక్సిమిటీ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. భద్రత కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, ఫేస్‌ లాక్‌ ఫీచర్‌ ను కలిగి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Poco F6 Deadpool Limited Edition Smartphone to launch on july 26 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X