12GB ర్యామ్, 50MP కెమెరా పోకో F6 లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రారంభం.. రూ.4000 డిస్కౌంట్!
పోకో సంస్థ గత నెలలో పోకో F6 స్పెషల్ ఎడిషన్ ను (Poco F6 Deadpool Special Edition Sale) విడుదల చేసింది. ఈ పోకో F6 డెడ్‌పూల్ లిమిటెడ్ ఎడిషన్ ఇవాళ్టి నుంచి కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉండనుంది. డెడ్‌పూల్ & వుల్వరైన్ విడుదల సందర్భంగా ఈ స్పెషల్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ఈ హ్యాండ్‌సెట్ ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. బ్యాంకు ఆఫర్లతో ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.4000 తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు.
పోకో F6 డెడ్‌పూల్ లిమిటెడ్ ఎడిషన్ కేవలం ఒకే స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ సాధారణ ధర రూ.33,999 గా ఉండగా.. ఈ సేల్‌లో భాగంగా బ్యాంకు ఆఫర్లతో కలిపి రూ.29,999 కే సొంతం చేసుకోవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ ప్రత్యేక లోకోను కలిగి ఉంది. ఛార్జర్ కూడా డెడ్‌పూల్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. అయితే ఎటువంటి సాఫ్ట్‌వేర్, వాల్‌పేపర్‌లను అందించదు.

పోకో F6 డెడ్‌పూల్ లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
ఈ స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల 1.5k అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 1220*2712 పిక్సల్ రిజల్యూషన్, 120Hz రీప్రెష్ రేట్, 2400 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే కార్నింగ్ గొరెల్లా గ్లాస్ విక్టస్ రక్షణను పొందుతుంది.
ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. గరిష్ఠంగా 12GB LPDDR5x ర్యామ్ మరియు 256GB స్టోరేజీతో జతచేయబడి ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS ను కలిగి ఉంటుంది. 5000mAh బ్యాటరీ పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ కొనుగోలు సమయంలో ప్రత్యేకంగా ఛార్జర్‌ను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు.
కెమెరా విభాగం పరంగా ఈ లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP సోనీ IMX882 కెమెరాను కలిగి ఉంటుంది. 8MP సోనీ IMX355 అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ హ్యాండ్‌సెట్ 20MP కెమెరాను కలిగి ఉంటుంది.
కనెక్టివిటీ పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ బ్లూటూత్ 5.4, వైఫై 6, NFC, IR సెన్సార్, USB-C ఫీచర్లను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, IP64 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా రానుంది.
గిజ్ బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








