90W ఛార్జింగ్, 50MP కెమెరాతో పోకో F6 స్మార్ట్‌ఫోన్, తొలిసారిగా పోకో ట్యాబ్లెట్.. పూర్తి వివరాలు.??
ఫోకో బ్రాండ్ నుంచి భారత్ మార్కెట్ లోకి త్వరలో రెండు ఉత్పత్తులు లాంచ్ కానున్నాయని తెలుస్తోంది. ఇందులో ఒకటి గత సంవత్సరం విడుదల అయిన పోకో F5 తర్వాత తరం వెర్షన్‌గా పోకో F6 ( Poco F6) లాంచ్ కానుందని సమాచారం. దీంతోపాటు పోకో ట్యాబ్లెట్ ను కూడా లాంచ్ చేయనుందని సమాచారం. అయితే దీనిపై పోకో ఎటువంటి సమాచారం వెల్లడించలేదు.
90W ఛార్జింగ్ సపోర్టు, 5000mAh బ్యాటరీ :
పోకో F6 స్మార్ట్ ఫోన్ రెడ్‌మి టర్బో 3 రీబ్రాండెడ్‌గా వస్తుందని తెలుస్తోంది. ఈ రెడ్‌మి టర్బో 3 గత నెలలో చైనాలో లాంచ్ అయింది. దీని ఆధారంగా పోకో F6 హ్యాండ్ సెట్ 90W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు స్నాప్ డ్రాగన్ 8s జెన్ 3 SoC పైన పనిచేస్తుందని సమాచారం.

50MP సోనీ కెమెరా :
కొన్ని నివేదికల ప్రకారం పోకో F6 స్మార్ట్ ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP సోనీ IMX882 సెన్సార్ ను కలిగి ఉంటుంది. దీంతోపాటు 8MP అల్ట్రా వైడ్ సోనీ IMX355 సెన్సార్ తో లాంచ్ కానుంది. దీంతోపాటు 20MP OV20B కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
పోకో కొత్త ఫోన్ F6 ధర ఎంత ఉంటుందనే సమాచారం లీక్ కాలేదు. అయితే రూ.30,000 కంటే తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ హ్యాండ్ సెట్‌తోపాటు పొకో ట్యాబ్లెట్ ను కూడా భారత్ మార్కెట్‌లో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ సంవత్సరం మార్చిలో చైనాలో లాంచ్ అయిన రెడ్‌మి ప్యాడ్ ప్రో.. భారత్‌లో ప్రోకో బ్రాండ్‌తో విడుదల అయ్యే అవకాశం ఉంది.
తొలి పోకో ట్యాబ్లెట్ ఇదేనా..? :
దీంతో పోకో తొలిసారిగా భారత్‌లో ట్యాబ్లెట్ ను లాంచ్ చేసినట్లు అవుతుంది. చైనాలో విడుదలైన మోడల్ ఆధారంగా ఈ పోకో ట్యాబ్లెట్ 12.1 అంగుళాల LCD డిస్‌ప్లే ను కలిగి ఉంటుంది. 2.5k రిజల్యూషన్ తో విడుదల కానుందని తెలుస్తోంది.
10000mAh బ్యాటరీ సామర్థ్యం :
ఈ పోకో ట్యాబ్లెట్ వైఫై వెర్షన్ లో మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు 10000mAh బ్యాటరీ సహా 4nm చిప్ సెట్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అయితే పోకో F6 మరియు పోకో ట్యాబ్లెట్ పై సంస్థ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. విడుదల వివరాలనూ వెల్లడించలేదు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








