7550mAh భారీ బ్యాటరీ, 50MP OIS కెమెరా, డ్యూయల్ టోన్ ఫినిష్‌తో 5G ఫోన్.. విడుదల తేదీ వెల్లడి..!
Poco F7 Launch Date : పోకో F7 స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లో విడుదల కానుంది. తాజాగా లాంచ్ తేదీని పోకో తమ X పోస్ట్ ద్వారా వెల్లడించింది. దీంతోపాటు డిజైన్ ను కూడా విడుదల చేసింది. భారత్ మార్కెట్‌తోపాటు గ్లోబల్ మార్కెట్‌లోనూ ఈ ఫోన్ ఒకే తేదీన విడుదల కానుంది. తాజా వివరాల ఆధారంగా విడుదల తేదీ సహా స్పెసిఫికేషన్‌ల వివరాలు కూడా వెల్లడయ్యాయి.
పోకో F7 ఎప్పుడు విడుదల కానుంది? :
పోకో ఇండియా X పోస్ట్ ఆధారంగా పోకో F7 స్మార్ట్‌ఫోన్ జూన్ 24 సాయంత్రం 5:30 గంటలకు విడుదల కానుంది. ఇదే తేదీన గ్లోబల్ మార్కెట్లో కూడా విడుదల కానుంది. విడుదల అనంతరం భారత్ మార్కెట్‌లో ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు.

డ్యూయల్ టోన్ ఫినిష్ :
పోకో F7 స్మార్ట్‌ఫోన్ ప్రొమోషనల్ టీజర్ ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు బ్లాక్, సిల్వర్‌తో కూడిన డ్యూయల్ టోన్ ఫినిష్‌ను కలిగి ఉంది. ఈ పోకో హ్యాండ్‌సెట్ గురించి ఇటీవలే అనేక వివరాలు లీక్ అయ్యాయి. దీని ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ 6.83 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని సమాచారం. ఈ ఫోన్ అల్యూమినియం ఫ్రేమ్‌ను ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
భారీ బ్యాటరీ ఫోన్ :
ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్ బ్యాటరీ వివరాలు వెల్లడయ్యాయి. ఫ్లిప్‌కార్ట్ ప్రొమోషనల్ టీజర్ ఆధారంగా 90W వైర్ ఛార్జింగ్, 22.5W రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో 7550mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ప్రత్యేక ఛార్జింగ్ టెక్నాలజీతో పనిచేస్తుందని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. రెండు రోజులపాటు ఉపయోగించుకోవచ్చని తెలుస్తోంది.
What you knew was just the trailer. Asli power drops now.💪🏼
— POCO India (@IndiaPOCO) June 17, 2025
Launching on 24th June, 5:30 PM IST on #Flipkart
.
.
.#POCOF7 #AllPowerNoBS pic.twitter.com/iDNxlPxtfw
OIS సపోర్టుతో :
తాజా టీజర్ ఆధారంగా ఈ ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. అయితే మిగిలిన కెమెరాల వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
అయితే గతంలోనే ఈ ఫోన్ కెమెరాల వివరాలు లీక్ అయ్యాయి. ఈ లీక్స్ ఆధారంగా హ్యాండ్‌సెట్ 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్ తోపాటు ముందువైపు 20MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ :
ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు స్నాప్‌డ్రాగన్ లోగోను గుర్తించవచ్చు. దీని ఆధారంగా ఈ పోకో F7 స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఆండ్రాయిడ్ 15 పైన పనిచేసే అవకాశం ఉంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. ఈ ఫోన్ రూ.30000 ధర రేంజ్‌లో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
ఇప్పటికే రెండు భారీ బ్యాటరీ ఫోన్‌లు :
ఈ పోకో F7 ఫోన్ 7550mAh బ్యాటరీతో అందుబాటులోకి రానుంది. దీంతో భారీ బ్యాటరీ ఫోన్‌గా గుర్తింపు పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత్ మార్కెట్‌లో iQOO Z10 మరియు వివో T4 స్మార్ట్‌ఫోన్‌లు 7300mAh బ్యాటరీతో పనిచేస్తున్నాయి.


Click it and Unblock the Notifications