7550mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల డిస్‌ప్లే, 50MP కెమెరాతో 5G స్మార్ట్‌ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు..!
Poco F7 5G Smartphone : పోకో నుంచి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న భారీ బ్యాటరీ ఫోన్ పోకో F7 5G భారత్ మార్కెట్‌లో ఇవాళ విడుదల అయింది. భారత్ తోపాటు గ్లోబల్ మార్కెట్‌లోనూ లాంచ్ అయింది. ఈ ఫోన్ ఏకంగా 7550mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. అతిపెద్ద బ్యాటరీ కలిగిన ఫోన్‌గా గుర్తింపు పొందింది. కెమెరా విభాగం తోపాటు బెస్ట్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్‌గా అందుబాటులోకి వచ్చింది. ఫ్రాస్ట్ వైట్, ఫాంటమ్ బ్లాక్, సైబర్ సిల్వర్ ఎడిషన్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. పోకో F7 5G స్మార్ట్‌ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు.
పోకో F7 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ పోకో స్మార్ట్‌ఫోన్ 6.83 అంగుళాల ఫుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 3200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 2560Hz టచ్ శాంప్లింగ్ రేట్, 3840Hz PWM డిమ్మింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

వాటర్ ప్రూఫ్ ఫోన్ :
ఈ ఫోన్ HDR10+ సపోర్టును కలిగి ఉంది. ఈ ఫోన్ అల్యూమినియం మిడిల్ ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్ ప్యానల్‌తో అందుబాటులోకి వచ్చింది. IP66+IP68+IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ ఫోన్ సెక్యూరిటీ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.
శక్తివంతమైన చిప్‌సెట్ :
పోకో F7 5G స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 12GB LPDDR5X ర్యామ్, 512GB UFS 4.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS 2.0 ను కలిగి ఉంది. ఈ ఫోన్ 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

కెమెరా వివరాలు :
కెమెరా విభాగం పరంగా పోకో F7 5G స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో OIS, PDAF సపోర్టుతో 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 20MP కెమెరాను అమర్చారు.
ఈ ఫోన్ గూగుల్ జెమినీ, సర్కిల్ టూ సెర్చ్, AI Notes, AI Image Enhancement, AI Interpreter, AI Image Expansion వంటి ఆప్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లున్నాయి. ఈ ఫోన్ థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం AI ఆధారిత టెంపరేచర్ కంట్రోల్, 6000mm sq వేపర్ కూలింగ్ ఛాంబర్‌తో కూడిన 3D IceLoop సిస్టమ్‌ను కలిగి ఉంది. మెరుగైన గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం వైల్డ్‌బూస్ట్ ఆప్టిమైజేషన్ 3.0 ఫీచర్‌ను కలిగి ఉంది.

భారీ బ్యాటరీ ఫోన్ :
ఈ ఫోన్‌లో మరో ఆకట్టుకొనే అంశం బ్యాటరీ. పోకో F7 5G స్మార్ట్‌ఫోన్ 90W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్, 22.5W వైర్ రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో 7550mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీతో పనిచేస్తుంది. 5G, 4G, బ్లూటూత్ 6.0, వైపై 7, GPS, NFC, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఈ ఫోన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది.
పోకో F7 5G స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ :
పోకో F7 5G స్మార్ట్‌ఫోన్ 12GB ర్యా్మ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.31999 గా ఉంది. అదే 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.33999 గా ఉంది. ఈ ఫోన్ జులై 1 వ తేదీ నుంచి సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
తొలి సేల్‌లో భాగంగా రూ.2000 ఎక్స్ఛేంజీ బోనస్ లేదా HDFC, SBI, ICICI బ్యాంకు కార్డుల ద్వారా రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా ప్రారంభ ధర రూ.29999 గా ఉంటుంది. దీంతోపాటు 12 నెలల వరకు నో కాస్ట్ EMI ప్రయోజనాలను పొందవచ్చు. సంవత్సరం అదనపు వారంటీతోపాటు, 1 సంవత్సరం ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ఆఫర్‌ను కూడా అందిస్తుంది.


Click it and Unblock the Notifications