ఎక్కువగా ఫోన్ వినియోగిస్తుంటారా.. అయితే ఈ భారీ బ్యాటరీ ఫోన్ పైన ఓ లుక్కేయండి..?
మీరు స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారా.. మంచి డిజైన్ కలిగిన ఫోన్ కోసం చూస్తున్నారా.. మంచి పనితీరు అందించే హ్యాండ్‌సెట్ కోసం ఎదురుచూస్తున్నారా.. ఇలాంటి వారికి కోసం పోకో నుంచి F7 5G ఫోన్ లాంచ్ అయింది. జులై 1 వ తేదీ నుంచి సేల్ ప్రారంభం కానుంది. ఈ ఫోన్ ఏకంగా 7550mAh బ్యాటరీని కలిగి ఉంది. మరియు IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ ఫ్రూప్‌గా ఉంది.
పోకో F7 5G స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ :
ఈ ఫోన్ (Poco F7 5G Sale) 12GB ర్యా్మ్ + 256GB స్టోరేజీ ధర రూ.31999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.33999 గా ఉంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా జులై 1 వ తేదీ నుంచి సేల్ ప్రారంభం కానుంది. HDFC, SBI, ICICI బ్యాంకు కార్డులపై రూ.2000 తగ్గింపును పొందవచ్చు.

బ్యాంకు డిస్కౌంట్‌లతో కలిగి ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.29,999 కే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు 12 నెలల వరకు నో కాస్ట్ EMI ఆప్షన్‌ను అందుబాటులో ఉంది. దీంతోపాటు తొలి సేల్‌లో భాగంగా 1 సంవత్సరం ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ను అందిస్తుంది.
పోకో F7 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.83 అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను పొందుతుంది. డిజైన్ పరంగానూ అల్యూమినియం మిడిల్ ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్ ప్యానల్‌ను కలిగి ఉంది. మరియు IP66+ IP68+ IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 SoC ప్రాసెసర్ తో పనిచేస్తుంది. 12GB LPDDR5X ర్యామ్, 512GB UFS 4.1 స్టోరేజీతో జతచేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS 2.0 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ కోసం 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తామని పోకో తెలిపింది.

ఈ పోకో ఫోన్ ప్రస్తుతానికి భారీ బ్యాటరీతో లాంచ్ అయింది. ఈ ఫోన్ ఏకంగా 90W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్, 22.5W వైర్ రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో 7550mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.
కెమెరా విభాగం పరంగా OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్), PDAF సపోర్టుతో 50MP సోనీ IMX882 కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్‌తోపాటు 20MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. AI Image Enhancement, AI Interpreter, AI Image Expansion వంటి AI ఫీచర్లున్నాయి.
ఈ ఫోన్ 3D IceLoop సిస్టమ్‌ను కలిగి ఉంది. గేమింగ్, మల్టీ టాస్కింగ్ సమయంలో మెరుగైన పనితీరు అందించే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్ గూగుల్ జెమిని, సర్కిల్ టూ సెర్చ్, AI నోట్స్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లున్నాయి. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. 5G, 4G, బ్లూటూత్ 6.0, వైపై 7, GPS, NFC పోర్టును కలిగి ఉంది.


Click it and Unblock the Notifications