Home
Mobile

Poco F7 వచ్చేస్తోంది.. IMDA, BIS సర్టిఫికేషన్ పూర్తి..! Redmi Turbo 4 Pro ఫీచర్లతో రానుందా?

Poco F7 Launch : పోకో (Poco) ఫ్యాన్స్‌కు శుభవార్త. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పోకో F7 గ్లోబల్ మార్కెట్లోకి అడుగుపెట్టే సమయం దగ్గరపడింది. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్ సింగపూర్ IMDA సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో 25053PC47G మోడల్ నంబర్‌తో కనిపించింది. ఈ లిస్టింగ్, పోకో F7 లాంచ్ త్వరలోనే ఉండొచ్చని సూచిస్తోంది, ఇదే ఫోన్ కొద్ది రోజుల క్రితం BIS (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) వెబ్‌సైట్‌లోనూ కనిపించింది.

దీన్నిబట్టి చూస్తే, ఇండియాలో కూడా త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశాలున్నాయి. IMDA మోడల్ నంబర్‌లోని చివరి అక్షరం 'G', ఇది గ్లోబల్ వేరియంట్ అని స్పష్టం చేస్తోంది. అలాగే, BIS సర్టిఫికేషన్ భారత మార్కెట్‌లో కూడా అడుగుపెట్టనుందని నిర్ధారిస్తోంది. ఇటీవల కొన్ని దేశాల్లో పోకో F7 ప్రో, F7 అల్ట్రా మోడళ్లు విడుదలయ్యాయి.

Poco F7 Launch Imminent

* రెడ్‌మీ టర్బో 4 ప్రోకి రీబ్రాండెడ్ వెర్షనేనా?
బేస్ (వనిల్లా) F7 మోడల్‌ను వివిధ మార్కెట్లలోకి తీసుకురావడానికి పోకో సిద్ధమైనట్లు ఈ సర్టిఫికేషన్లు బలమైన సంకేతాలనిస్తున్నాయి. మార్కెట్లో వస్తున్న వార్తల ప్రకారం, పోకో F7 ఫోన్, ఏప్రిల్‌లో చైనాలో విడుదలైన రెడ్‌మీ టర్బో 4 ప్రో (Redmi Turbo 4 Pro)కి రీబ్రాండెడ్ వెర్షన్‌గా రానుందని తెలుస్తోంది.

ఈ వాదనకు మోడల్ నంబర్లే బలం చేకూరుస్తున్నాయి. చైనాలోని రెడ్‌మీ టర్బో 4 ప్రో మోడల్ నంబర్ 25053RT47C. ఇక్కడ 'RT' అంటే రెడ్‌మీ అని, 'C' అంటే చైనా అని అర్థం. అదే పోకో ఫోన్ మోడల్ నంబర్‌లో 'PC' (పోకో కోసం) వాడారు.

చివరన 'G' (గ్లోబల్ కోసం), 'I' (ఇండియా కోసం) వంటి అక్షరాలు ఉంటున్నాయి. ఈ నమూనాను బట్టి చూస్తే, పోకో F7 అనేది షియోమీ (Xiaomi) వారి రెడ్‌మి టర్బో 4 ప్రోకి అంతర్జాతీయ వెర్షన్ అని అర్థమవుతోంది. పోకో F7 రెడ్‌మీ టర్బో 4 ప్రో ఆధారంగా వస్తే, ఇందులో అద్భుతమైన ఫీచర్లు ఉండొచ్చు.

* అంచనా వేస్తున్న ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
6.83-అంగుళాల అమోలెడ్ (AMOLED) డిస్‌ప్లే, 1280x2772 పిక్సెల్స్ రిజల్యూషన్, సున్నితమైన 120Hz రిఫ్రెష్ రేట్, 3,200 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ తో ఆ స్మార్ట్ ఫోన్ రావచ్చు. శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 (Snapdragon 8s Gen 4) ప్రాసెసర్ ఇవ్వచ్చు.

16GB వరకు RAM, 256GB నుంచి 1TB వరకు స్టోరేజ్ ఆప్షన్లు ఉండొచ్చు. కెమెరాల విషయానికి వస్తే OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్)తో కూడిన 50MP సోనీ LYT-600 ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, సెల్ఫీల కోసం 20MP ఫ్రంట్ కెమెరా అందించవచ్చు.

* ఇతర ఫీచర్లు, బ్యాటరీ
డాల్బీ విజన్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత హైపర్OS 2 (HyperOS 2), ఇన్-డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటివి కూడా ఉండవచ్చు. చైనాలో విడుదలైన రెడ్‌మీ టర్బో 4 ప్రోలో 7,550mAh భారీ బ్యాటరీ ఉంది. ఇది 90W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 22.5W రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

అయితే, గ్లోబల్ వేరియంట్ అయిన పోకో F7లో బ్యాటరీ సామర్థ్యం కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా. కొన్నిసార్లు చైనా బ్రాండ్లు గ్లోబల్ మోడళ్లలో ఇలాంటి మార్పులు చేస్తుంటాయి. ఇక మన్నిక విషయానికొస్తే, దుమ్ము, నీటి నిరోధకత కోసం IP66, IP68, IP69 వంటి అద్భుతమైన రేటింగ్స్‌తో పోకో F7 రావచ్చు.

* లాంచ్ ఎప్పుడు ఉండొచ్చు..?
లీకుల సమాచారం ప్రకారం, పోకో F7 గ్లోబల్ మార్కెట్లలో మే నెల చివరి నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే పలు సర్టిఫికేషన్లు పొందడంతో, అధికారిక ప్రకటన అతి సమీపంలోనే ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ వనిల్లా పోకో F7 రాకతో, ఇప్పటికే ఉన్న F7 ప్రో F7 అల్ట్రాలతో కలిసి ఈ సంవత్సరం బ్రాండ్ ఫ్లాగ్‌షిప్ లైనప్ పూర్తవుతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Poco F7 Launch Imminent: Gets IMDA and BIS Certification, Rumored as Rebranded Redmi Turbo 4 Pro
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X