120W ఛార్జింగ్, 16GB ర్యామ్, 50MP కెమెరాతో పోకో F7 ప్రో, F7 అల్ట్రా ఫోన్లు.. మార్చి 27న విడుదల..
Poco F7 Pro, Poco F7 Pro Ultra: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ పోకో తన కొత్త F7 సిరీస్‌తో గ్లోబల్ మార్కెట్‌ను షేక్ చేయడానికి సిద్ధమైంది. పోకో F7 ప్రో, పోకో F7 అల్ట్రా అనే రెండు ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ ఫోన్ల లాంచ్ ఈవెంట్ సింగపూర్‌లో 2025, మార్చి 27న GMT 8:00 గంటలకు (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు) జరగనుంది.
లాంచ్ ముందే, పోకో కంపెనీ ఈ రెండు ఫోన్ల వెనుక డిజైన్‌ను చూపిస్తూ ఒక టీజర్ ఇమేజ్‌ను రిలీజ్ చేసింది. ఈ ఫోన్లు చూడటానికి చాలా ఖరీదైనవిగా, ఆకర్షణీయంగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. అంతేకాదు, ఒక అన్‌బాక్సింగ్ వీడియో కూడా ఆన్‌లైన్‌లో లీక్ అయింది. ఈ వీడియోలో ఫోన్ల డిజైన్, ఫీచర్లు అన్ని క్లియర్‌గా కనిపిస్తున్నాయి.

* డిజైన్, చిప్‌సెట్
పోకో F7 ప్రో, F7 అల్ట్రా ఫోన్లు నలుపు, పసుపు రంగుల్లో వస్తాయి. చూడటానికి ఆకర్షణీయంగా, మోడర్న్‌గా ఉన్నాయి. ఫోన్ వెనుకవైపు గుండ్రంగా కెమెరా సెటప్ ఇచ్చారు. కెమెరా చుట్టూ సర్కిల్‌లా డిజైన్ ఉంది. దాని బయట LED ఫ్లాష్‌ని పెట్టారు. పోకో F7 ప్రో ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ ఇవ్వచ్చు.
F7 అల్ట్రాలో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌ను అందించవచ్చు. ఇలాంటి ప్రాససర్లు మామూలుగా టాప్ మోడల్ ఫోన్లలోనే ఉంటాయి. అందుకే ఈ ఫోన్లు కూడా రేటు విషయంలో కాస్త ఎక్కువగానే ఉంటాయని అనుకోవచ్చు. గేమింగ్ ఆడేవాళ్లకి, వీడియోలు ఎడిటింగ్ చేసేవాళ్లకి ఈ ఫోన్లు సరిపోతాయి.
* అన్‌బాక్సింగ్ వీడియోలో ఫీచర్లు లీక్
టెక్‌టాబ్లెట్స్ అనే యూట్యూబ్ ఛానెల్ ఈ ఫోన్లకు సంబంధించిన అన్‌బాక్సింగ్ వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియోలో ఫోన్ల ఫీచర్ల గురించి చాలా వివరాలు బయటపెట్టారు. F7 ప్రో మోడల్‌లో 12GB ర్యామ్ ఉండగా, F7 అల్ట్రాలో ఏకంగా 16GB ర్యామ్ ఇస్తున్నారు. రెండిట్లోనూ 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది.
అంటే కొనుగోలుదారులకు కావాల్సిన యాప్స్, గేమ్స్, వీడియోలు, ఫొటోలు అన్నిటికీ తగినంత స్టోరేజీ ఉంటుంది. బాక్స్‌లో ఏమేం వస్తాయో కూడా వీడియోలో చూపించారు. ఫోన్‌తో పాటు ఒక ప్రొటెక్టివ్ కేస్, ఛార్జర్, USB టైప్-C కేబుల్, సిమ్ తీసేందుకు టూల్, ఇంకా యూజర్ గైడ్ లాంటి పేపర్లు కూడా ఉంటాయి.
* ఛార్జింగ్, బ్యాటరీ
ఈ ఫోన్లు ఛార్జింగ్ విషయంలో కూడా వెనక్కి తగ్గడం లేదు. పోకో F7 ప్రో 90W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది, అదే F7 అల్ట్రా ఏకంగా 120W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. బ్యాటరీ విషయానికొస్తే, పోకో F7 ప్రోలో 6,000mAh భారీ బ్యాటరీ ఉంది. F7 అల్ట్రాలో 5,300mAh బ్యాటరీ ఉంటుంది.
* డిస్‌ప్లే, కెమెరా, సాఫ్ట్‌వేర్
రెండు ఫోన్లలోనూ పంచ్-హోల్ డిస్‌ప్లే ఉంటుంది. డిస్‌ప్లే డిజైన్ కూడా డ్యూయల్-టోన్ ఫినిష్‌తో చాలా స్టైలిష్‌గా ఉంది. కెమెరాల గురించి ఇంకా పెద్దగా సమాచారం లేదు కానీ, వెనుకవైపు 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుందని అంటున్నారు. ఈ కెమెరాలో OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) ఫీచర్ కూడా ఉంటుందట.
దీనివల్ల ఫొటోలు షేక్ అవ్వకుండా చాలా స్పష్టంగా వస్తాయి. సాఫ్ట్‌వేర్ విషయానికొస్తే, ఈ ఫోన్లు హైపర్ఓఎస్ 2 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తాయి. ఇది చాలా స్మూత్‌గా, ఫాస్ట్‌గా పనిచేస్తుంది. అంతేకాదు, ఈ రెండు ఫోన్లకు IP68 రేటింగ్ కూడా ఉంటుందని లీకులు వస్తున్నాయి. అంటే ఫోన్ నీళ్లలో పడ్డా, దుమ్ము పడ్డా ఏమీ కాదు.


Click it and Unblock the Notifications








