Poco F7 సిరీస్ విడుదల.. స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్, వైర్‌లెస్ ఛార్జింగ్‌తో అల్ట్రా వేరియంట్ లాంచ్..!
పోకో F7 సిరీస్ ఇవాళ గ్లోబల్ మార్కెట్‌లో (Poco F7 Series Launched) లాంచ్ అయింది. ఈ సిరీస్‌లో భాగంగా పోకో F7 ప్రో, F7 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ సిరీస్ మెరుగైన పనితీరును అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌లు, 50MP కెమెరాలను కలిగి ఉన్నాయి. డిజైన్ పరంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సిరీస్ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు మీకోసం.
పోకో F7 సిరీస్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
పోకో F7 ప్రో స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. అదే అల్ట్రా వేరియంట్ స్నాప్‌డ్రాగన్ 8 Elite ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ రెండు వేరియంట్స్‌లు ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS 2 (Skin) తో పనిచేస్తుంది. ఈ OS WildBoost ఆప్టిమైజేషన్ 4 ఫీచర్‌ను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ మల్టీ టాస్కింగ్ సమయంలో థర్మల్ మేనేజ్‌మెంట్, ఫ్రేమ్ రేట్, విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తుంది.

డిస్‌ప్లే వివరాలు :
పోకో F7 ప్రో హ్యాండ్‌సెట్ 6.67 అంగుళాల 2K OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 1800 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే HDR కంటెంట్‌ను సపోర్టు చేస్తుంది. మరియు గొరిల్లా గ్లాస్ 7i రక్షణను పొందుతుంది.
పోకో F7 ప్రో అల్ట్రా వేరియంట్ 6.67 అంగుళాల 2K OLED డిస్‌ప్లేతో లాంచ్ అయింది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 480Hz టచ్ శాంప్లింగ్ రేట్, 3200 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. HDR కంటెంట్‌ను సపోర్టు చేస్తుంది. ఈ డిస్‌ప్లే పోకో షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్‌ను పొందుతుంది.
You got two colors to choose from:
— POCO (@POCOGlobal) March 27, 2025
Black that offers modern and timeless design that exudes sophistication and elegance.
And Yellow represents bold and vibrant making a statement for those who dare to stand out.#POCOF7Ultra pic.twitter.com/PWddmLhpIM
కెమెరా వివరాలు :
కెమెరా విభాగం పరంగా పోకో F7 ప్రో స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP సోనీ లైట్ ఫ్యూజన్ 800 కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 20MP కెమెరాను అమర్చి ఉంది. 4K క్వాలిటీతో వీడియోను రికార్డు చేయవచ్చు.
అదే అల్ట్రా స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. OIS సపోర్టుతో 50MP సోనీ లైట్ ఫ్యూజన్ 800 ప్రైమరీ కెమెరా, 2.5x జూమ్‌తో 50MP టెలిఫోటో కెమెరా, 32MP అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
And got three colors: silver, blue and black to choose from.
— POCO (@POCOGlobal) March 27, 2025
Now which colour tells your story?#POCOF7Pro pic.twitter.com/Vqr8WRgqHF
బ్యాటరీ :
పోకో F7 ప్రో స్మార్ట్‌ఫోన్ 90W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. అదే అల్ట్రా వేరియంట్ 120W వైర్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో 5300mAh బ్యాటరీని కలిగి ఉంది. బ్యాటరీ పరంగా బేస్ వేరియంట్ కంటే అల్ట్రా వేరియంట్ ఫాస్ట్ ఛార్జింగ్, వైర్‌లెస్ సపోర్టును కలిగి ఉంది.
పోకో F7 ప్రో స్మార్ట్‌ఫోన్ బ్లూటూత్ 5.4, వైఫై 7, IP68 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. అదే అల్ట్రా వేరియంట్ బ్లూటూత్ 6.0, వైఫై 7, IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది, ఈ రెండు ఫోన్‌లు NFC, స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. మరియు భద్రత కోసం అల్ట్రాసోనిక్ ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది.
ధర, సేల్ వివరాలు :
పోకో F7 ప్రో స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర $4999, 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర $549 గా ఉంది. ఎర్లీ బర్డ్ సేల్‌లో భాగంగా ఈ ఫోన్‌లను $449, $499 కే సొంతం చేసుకోవచ్చు.
అదే పోకో F7 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ను 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర $649 గా ఉంది. 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర $699 గా ఉంది. ఎర్లీ బర్డ్ సేల్‌లో భాగంగా $599, $649 కే కొనుగోలు చేయవచ్చు. అయితే పోకో F7 సిరీస్ ఫోన్‌లు భారత్ మార్కెట్‌లో విడుదల కానున్నాయా లేదా అనే సమాచారం వెల్లడి కాలేదు.


Click it and Unblock the Notifications








