Home
Mobile

శక్తివంతమైన చిప్‌సెట్‌, 7550mAh బ్యాటరీ, డ్యూయల్‌ టోన్‌ డిజైన్‌తో 5G ఫోన్‌.. వచ్చే వారంలోనే విడుదల..!

Poco F7 Smartphone Chipset : పోకో F7 5G స్మార్ట్‌ఫోన్ భారత్‌ మార్కెట్‌ లో జూన్‌ 24 వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్‌ గురించి అనేక వివరాలు వెల్లడయ్యాయి. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్ బ్యాక్‌ ప్యానల్‌ డిజైన్‌ విడుదల అయింది. దీని ఆధారంగా ఈ పోకో ఫోన్‌ డ్యూయల్‌ టోన్‌ డిజైన్‌ తో అందుబాటులోకి వస్తుంది. దీంతోపాటు ఫోన్‌ బ్యాటరీ, కెమెరా వివరాలు ఇప్పటికే వెల్లడయ్యాయి. ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన వివరాల ఆధారంగా ఈ ఫోన్‌ బ్యాటరీ ఆకట్టుకుంటుంది.

భారత్‌ మార్కెట్‌లో భారీ బ్యాటరీతో :
ఈ హ్యాండ్‌సెట్‌ 90W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్, 22.5W వైర్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 7550mAh భారీ బ్యాటరీతో పనిచేస్తుంది. బ్యాటరీ ఫోన్‌ గా గుర్తింపు పొందనుంది. ఈ ఫోన్ గ్లోబల్‌ వేరియంట్‌ 6500mAh బ్యాటరీతో లాంచ్ కానుందని తెలుస్తోంది.

Poco F7 Smartphone chipset

ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ కెమెరా ఫీచర్‌ :
దీంతోపాటు పోకో ఫోన్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో OIS (ఆప్టికల్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ మిగిలిన కెమెరాల వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

తాజాగా చిప్‌సెట్ వివరాలు వెల్లడించిన పోకో :
అయితే తాజాగా పోకో F7 5G స్మార్ట్‌ఫోన్‌ చిప్‌సెట్‌ వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. పోకో X పోస్ట్‌ ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్‌ 8s జెన్‌ 4 SoC చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌ మైక్రోసైట్‌ ఆధారంగా ఈ చిప్‌సెట్‌ 12GB LPDDR5X ర్యామ్‌, UFS 4.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది.

థర్మల్ మేనేజ్‌మెంట్‌ కోసం :
ఈ చిప్‌సెట్‌ 2.1 మిలియన్‌ పాయింట్ల AnTuTu బెంచ్‌మార్క్‌ స్కోర్‌ ను కలిగి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ ఆధారంగా ఈ ఫోన్‌ థర్మల్‌ మేనేజ్‌మెంట్‌ కోసం 3D IceLoop సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. మరియు 6000sq mm వేపర్‌ కూలింగ్ ఛాంబర్‌ తో అందుబాటులోకి వస్తుంది. ఈ పోకో హ్యాండ్‌సెట్‌ వైల్డ్‌బూస్ట్‌ గేమింగ్‌ ఆప్టిమైజేషన్‌ 4.0 సపోర్టును కలిగి ఉంటుంది.

Take a Poll

అల్యూమినియం ఫ్రేమ్‌ :
ఇప్పటికే రిలీజ్‌ అయిన టీజర్‌ ఆధారంగా ఈ పోకో F7 స్మార్ట్‌ఫోన్ బ్లాక్, సిల్వర్‌ కలర్‌ వేరియంట్స్‌ తో కూడిన డ్యూయల్‌ టోన్‌ ఫినిష్‌ తో లాంచ్‌ కానుంది. ఈ హ్యాండ్‌సెట్ అల్యూమినియం ఫ్రేమ్‌ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. లీక్‌ అయిన వివరాల ఆధారంగా ఈ ఫోన్ 6.83 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేతో లాంచ్‌ కానుందని తెలుస్తోంది.

ఎప్పుడు విడుదల కానుంది? :
పోకో F7 స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ మార్కెట్‌లో జూన్‌ 24 వ తేదీ సాయంత్రం 5:30 గంటలకు విడుదల కానుంది. అదే రోజుల గ్లోబల్‌ మార్కెట్‌లో కూడా లాంచ్‌ కానుంది. విడుదల అనంతరం ఈ హ్యాండ్‌సెట్‌ ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి వస్తుంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
Poco F7 Smartphone chipset details revealed ahead of launch on june 24 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X