భారత్ మార్కెట్‌లోకి భారీ బ్యాటరీ ఫోన్.. 6.83 అంగుళాల డిస్‌ప్లే, IP68 రేటింగ్ సహా కీలక ఫీచర్‌లు..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ పోకో నుంచి త్వరలో భారత్ మార్కెట్‌లోకి పోకో F7 స్మార్ట్‌ఫోన్ (Poco F7 Smartphone) విడుదల కానుంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన అనేక వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ ప్రారంభం కానుంది. అయితే తాజాగా ఫ్లిప్‌కార్ట్ ప్రొమోషనల్ పేజీ ఆధారంగా ఈ ఫోన్ కీలక వివరాలు వెల్లడయ్యాయి. అయితే ఈ ఫోన్ కచ్చితంగా ఎప్పుడు విడుదల కానుందనే వివరాలు వెల్లడి కాలేదు.
ఫ్లిప్‌కార్ట్ ప్రొమోషనల్ పేజీ ఆధారంగా పోకో F7 స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ వివరాలు లీక్ అయ్యాయి. దీని ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ భారీ బ్యాటరీతో విడుదల కానుంది. ప్రస్తుతం ఐకూ, వివో ఫోన్‌లు 7300mAh బ్యాటరీలతో పనిచేస్తున్నాయి. అయితే ఈ పోకో F7 స్మార్ట్‌ఫోన్ ఏకంగా 7550mAh బ్యాటరీతో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

90W ఫాస్ట్ ఛార్జింగ్ :
దీంతో F7 ఫోన్ భారత్‌లో అతిపెద్ద బ్యాటరీని కలిగి ఉన్న ఫోన్‌గా గుర్తింపు పొందనుంది. మరియు ఈ ఫోన్ 90W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంటుంది. దీంతోపాటు 22.5 వైర్ రివర్స్ ఛార్జింగ్‌ను కూడా సపోర్టు చేస్తుందని తెలుస్తోంది.
ఈ పోకో హ్యాండ్‌సెట్ Si/C బ్యాటరీ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఫలితంగా ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి గరిష్ఠంగా 2.18 రోజుల వరకు ఉపయోగించుకొనేందుకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఎక్కువగా ఫోన్ ఉపయోగించే వారికి ఈ ఫోన్ మంచి ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది.
Forget finding charging points, find fun adventures 🏕️🌌🌄
— POCO India (@IndiaPOCO) June 15, 2025
.
.
.
.
.#AllPowerNoBS #ComingSoon #Flipkart #POCO pic.twitter.com/Yj7EX34h7w
పోకో F7 స్మార్ట్‌ఫోన్ డిజైన్ వివరాలు కూడా ఇటీవల లీక్ అయ్యాయి. ఆండ్రాయిడ్ ట్రజరర్ రిపోర్టు ఆధారంగా ఈ ఫోన్ స్లిక్ ఫినిష్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు కెమెరా మాడ్యూల్ కూడా ఆకట్టుకొనే విధంగా ఉంటుందని తెలుస్తోంది. వెనుక వైపు రెండు కెమెరాలతో అందుబాటులోకి రానుందని సమాచారం.
చిప్‌సెట్ అంచనా వివరాలు :
ఈ పోకో F7 స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్‌తో పనిచేసే అవకాశం ఉంది. ఈ చిప్‌సెట్ 12GB ర్యామ్‌ను సపోర్టు చేసే అవకాశం ఉంది. అయితే OS వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. త్వరలో లాంచ్ కానుందని భావిస్తున్న పోకో ఫోన్ ఎన్ని స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులోకి రానుందో వెల్లడి కాలేదు.
కొన్ని నివేదికల ఆధారంగా ఈ పోకో F7 ఫోన్... రెడ్‌మి టర్బో 4 ప్రో మోడల్‌కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీని ద్వారా ఈ పోకో ఫోన్ మరిన్ని వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.83 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
కెమెరా అంచనా వివరాలు :
కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్ మరియు 20MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరియు ఈ హ్యాండ్‌సెట్ IP68 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుందని తెలుస్తోంది.
పోకో F7 స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లో ఈ నెలలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే పైన తెలిపిన అనేక వివరాలపై పోకో అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఇప్పటికే ఐకూ Z10, వివో T4 ఫోన్‌లు 7300mAh బ్యాటరీతో అందుబాటులో ఉండగా.. పోకో F7 ఏకంగా 7550mAh బ్యాటరీతో అందుబాటులోకి వస్తుందనే వార్తలు.. హెవీ యూజర్లకు గుడ్‌న్యూస్ కానుంది.


Click it and Unblock the Notifications