7550mAh భారీ బ్యాటరీ.. 6.83 అంగుళాల భారీ డిస్‌ప్లేతో 5G ఫోన్..? పూర్తి వివరాలు..!
పోకో F7 సిరీస్ ఫోన్లు గ్లోబల్ మార్కెట్ లో మార్చి నెలలో విడుదల అయ్యాయి. ఈ సిరీస్ లో భాగంగా పోకో F7, పోకో F7 అల్ట్రా మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ ఫోన్‌లు త్వరలో భారత్ మార్కెట్ లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. గతంలోనే పోకో F7 అల్ట్రా వేరియంట్ ను టీజర్ విడుదల అయింది. తాజాగా పోకో ఇండియా X పోస్టు ఆధారంగా మరిన్ని వివరాలు వెల్లడయ్యాయి.
పోకో ఇండియా సోషల్ మీడియా పోస్ట్ ఆధారంగా కొత్త స్మార్ట్‌ఫోన్‌లు భారత్ మార్కెట్ లోకి రానున్నాయి. అయితే F7 ఫోన్లే కచ్చితంగా లాంచ్ కానున్నాయా లేదా అనే వివరాలు వెల్లడి కాలేదు. ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ ఆధారంగా వివరాలు విడుదల అయినా.. ఫోన్‌ల పేర్లు, స్పెసిఫికేషన్ల వివరాలు వెల్లడి కాలేదు.

అప్పుడే భారత్‌లోనూ విడుదల :
అయితే త్వరలో F సిరీస్ ఫోన్‌లు లాంచ్ కానున్నాయనే అర్థం వచ్చేలా The F Series Legacy అని రాసుకొచ్చింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న లీక్స్ ఆధారంగా పోకో F7 స్మార్ట్ ఫోన్ (Poco F7 smartphone) గ్లోబల్ మార్కెట్ లో జూన్ 17 నుంచి 19 తేదీల మధ్య విడుదలయ్యే అవకాశం ఉంది. ఇదే సమయంలో భారత్‌లోనూ లాంచ్ కానుందని తెలుస్తోంది.
అంచనా స్పెసిఫికేషన్‌ల వివరాలు :
ఇటీవల చైనాలో విడుదల అయిన రెడ్‌మి టర్బో 4 ప్రో స్మార్ట్‌ఫోన్ కు రీబ్రాండెడ్ వెర్షన్ గా పోకో F7 లాంచ్ కానుందని తెలుస్తోంది. దీని ఆధారంగా 6.83 అంగుళాల 1.5K OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 120Hz రీఫ్రెష్ రేట్, 3200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను కలిగి ఉండే అవకాశం ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్ తో పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ చిప్‌సెట్ 16GB LPDDR5x ర్యామ్ మరియు 1TB UFS 4.1 సపోర్టు చేస్తుందని తెలుస్తోంది. ఈ ఫోన్ ఎన్ని స్టోరేజీ వేరియంట్స్ లో అందుబాటులోకి వస్తుందో తెలియాల్సి ఉంది.
భారీ బ్యాటరీ :
పోకో F7 స్మార్ట్‌ఫోన్ 90W ఫాస్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7550mAh బ్యాటరీతో పనిచేసే అవకాశం ఉంది. ఈ ఫోన్ 22.5 రివర్స్ ఛార్జింగ్ ను కూడా సపోర్టు చేస్తుందని సమాచారం. కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP సోనీ LYT 600 (OIS, EIS) ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉంటుంది.
గ్లోబల్ మార్కెట్‌లో పోకో F7 ప్రో మోడల్ కూడా లాంచ్ అయింది. అయితే భారత్ మార్కెట్ లో ఈ ప్రో వేరియంట్ ఇప్పట్లో విడుదల అయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే గతంలో పోకో F7 ప్రో మోడల్ విడుదల కానుందనే వార్తలు వచ్చాయి. పూర్తి స్థాయిలో త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications