స్నాప్‌డ్రాగన్ శక్తివంతమైన చిప్‌సెట్‌లు, ఆండ్రాయిడ్ 16 OS తో పోకో F8 సిరీస్.. విడుదల తేదీ..!
Poco F8 Series launch Date : పోకో నుంచి F8 సిరీస్ ఫోన్ త్వరలో విడుదల కానుంది. ఈ సిరీస్ లో భాగంగా పోకో F8 ప్రో, F8 అల్ట్రా మోడల్స్ లాంచ్ కానున్నాయి. ఇందుకు సంబంధించిన గ్లోబల్ లాంచ్ ఈవెంట్ ను పోకో నవంబర్ 26 వ తేదీన నిర్వహించనుంది. ఈ వివరాలను పోకో తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా వెల్లడించింది. అయితే పోకో F8 స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.
ప్రో, మ్యాక్స్ మోడల్స్ మాత్రమే..! :
ఈ సిరీస్ మొత్తం మూడు ఫోన్‌లు ఉండగా.. ప్రో, అల్ట్రా మోడల్స్ మాత్రమే లాంచ్ కానున్నాయని తెలుస్తోంది. ఇటీవల చైనాలో విడుదల అయిన Redmi K90, K90 ప్రో మ్యాక్స్ తరహా స్పెసిఫికేషన్‌లను త్వరలో విడుదల కానున్న పోకో ఫోన్ లు కలిగి ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

అంచనా స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
పోకో F8 ప్రో స్మార్ట్‌ఫోన్ 6.59 అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. అదే F8 అల్ట్రా మోడల్ 6.9 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ రెండు ఫోన్ లు 120Hz రీఫ్రెష్ రేట్‌తో 1.5k రిజల్యూషన్ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
శక్తివంతమైన చిప్‌సెట్, OS :
పోకో F8 ప్రో మోడల్ స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్ చిప్‌సెట్ ను కలిగి ఉండే అవకాశం ఉంది. అదే అల్ట్రా వేరియంట్ స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్ జెన్ 5 ప్రాసెసర్ తో పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ రెండు మోడల్స్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత HyperOS 3 పైన పనిచేస్తాయని తెలుస్తోంది.
కెమెరాల అంచనా స్పెసిఫికేషన్లు :
కెమెరా విభాగం పరంగా ఈ సిరీస్ ప్రో మోడల్ OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు 2x జూమ్‌తో 50MP టెలిఫోటో లెన్స్, 8MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 20MP కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది.
మూడు 50MP కెమెరాలు :
అదే అల్ట్రా స్మార్ట్‌ఫోన్ మోడల్ 50MP ప్రైమరీ, 50MP అల్ట్రావైడ్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ను కలిగి ఉండే అవకాశం ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 20MP కెమెరాను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
పోకో F8 ప్రో, పోకో F8 అల్ట్రా మోడల్స్ బ్యాటరీ పరంగా 100W వైర్ ఛార్జింగ్, 50W వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్టుతో బ్యాటరీని కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ సిరీస్ గ్లోబల్ మార్కెట్ లో విడుదల కానుంది. అయితే భారత్ లో విడుదల కానుందా లేదా అనే వివరాలు తెలియాల్సి ఉంది. త్వరలో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications



