Home
Mobile

64MP కెమెరాతో POCO నుంచి కొత్త ఫోన్‌.. స్పెసిఫికేషన్ల వివరాలు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ POCO తన కొత్త ఫోన్‌ F5 సిరీస్‌ను భారత్‌ సహా గ్లోబల్‌ మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ షియోమి అనుబంద సంస్థ పోకో రెండు ఫోన్లను లాంచ్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌ కోసం మనం కొద్ది రోజులుగా వింటూనే ఉన్నాం. అయితే మరికొన్ని వివరాలను మాత్రం సంస్థ ధృవీకరించింది.

POCO సిరీస్‌కు చెందిన రెండు మోడళ్లను విడుదల చేయనుంది. అవి POCO F5 మరియు POCO F5 Pro. ఇందులో పోకో F5 బేస్‌ మోడల్‌గా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 7+ జెన్‌ 2 ప్రొసెసర్‌తో రానున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని స్నాప్‌డ్రాగన్‌ ఇండియా తన ట్విటర్‌ ద్వారా ధృవీకరించింది. ఈ రకమైన ప్రొసెసర్‌తో ఇండియాలో లాంచ్‌ కానున్న తొలి ఫోన్‌ POCO F5 మాత్రమే అని తెలిపింది.

POCO

పోకో F5 రెండు వారాల క్రితం చైనాలో లాంచ్‌ అయిన రెడ్‌మీ నోట్‌ Note 12 టర్బోకు రీబ్రాండెండ్‌ వెర్షన్‌ అని తెలుస్తోంది. ఆ ఫోన్‌ కూడా ఈ చిప్‌సెట్‌నే కలిగి ఉందని సమాచారం. అయితే ఈ పోకో F5 ఈ కింది స్పెసిఫికేషన్లు కలిగి ఉండే అవకాశం ఉంది.

డిస్‌ప్లే : పోకో F5 గ్లోబల్‌ వేరియంట్‌ 6.67 inch పుల్‌ HD+ అమోలెడ్‌ స్కీన్‌ 120 Hz రీఫ్రెష్‌ రేట్‌తో లాంచ్‌ అవుతున్నట్లు సమాచారం. మరియు ఈ స్మార్ట్‌ఫోన్‌ స్కీన్‌పైనే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ ఉంటుందని తెలుస్తోంది.

కెమెరా : పోకో F5 మూడు కెమెరాలతో వస్తున్నట్లు సమాచారం. అందులో 64MP ప్రైమరీ కెమెరా, 8MP రెండో కెమెరా, 2MP మూడో కెమెరాతో లాంచ్‌ అవుతున్నట్లు సమాచారం. సెల్ఫీల కోసం ముందువైపు 16MP కెమెరాను ఏర్పాటుచేశారు.

బ్యాటరీ : ఈ స్మార్ట్‌ఫోన్‌ 5000mAh బ్యాటరీతో 67W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ చేస్తుందని సమాచారం.

సాఫ్ట్‌వేర్‌ : పోకో F5 స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్ 13 MIUI 14తో లాంచ్‌ కానున్నట్లు తెలుస్తోంది.

భారత్‌తో పాటు పోకో F5ను గ్లోబల్‌ మార్కెట్‌లో లాంచ్‌ చేసేందుకు ఆ సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. గీక్‌బెంచ్‌ లిస్టింగ్‌లో ఈ మోడల్‌ నంబర్ 23049PCD8G ను గుర్తించినట్లు సమాచారం. పోకో F5 స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 7+ Gen2 ప్రాసెసర్‌ సహా 12GB RAMతో కలిగి ఉందని, కస్టమ్‌ UI తో పనిచేయనుందని తెలుస్తోంది.

పోకో F5 సహా ఆ స్మార్ట్‌ఫోన్‌ ప్రో వేరియంట్‌ POCO F5 Pro ను కూడా లాంచ్‌ చేయాలని ఆ సంస్థ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పోకో F5 కంటే ప్రో వేరియంట్‌ మరిన్ని ఫీచర్లతో రానుందని సమాచారం. మరింత శక్తివంతమైన క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌1 ప్రాసెసర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ వస్తున్నట్లు తెలుస్తోంది. మరియు బ్యాటరీ కూడా 5,500mAh ఉండనుందని, 67W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేయనుందని సమాచారం. అయితే ఈ రెండు ఫోన్ల ధరలు ఎంతనేది మాత్రం సంస్థ వెల్లడించలేదు.

More from GizBot

Best Mobiles in India

English summary
POCO launching its new series F5 smart phone in india soon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X