Home
Mobile

Poco M2 Pro స్మార్ట్‌ఫోన్‌ సేల్ నేడే!!! అద్భుతమైన ఆఫర్స్....

ప్రస్తుత అనేక కారణాల దృష్ట్యా ఎక్కువ మంది కేవలం బడ్జెట్ ధరలోనే స్మార్ట్‌ఫోన్‌లను కొనడానికి ఇష్టపడుతున్నారు. ఈ విభాగంలో 48 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్లను కలిగిన పోకో M2 ప్రో ఈరోజు మధ్యాహ్నం 12PM గంటల నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. క్వాడ్ రియర్ కెమెరా సెటప్, ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720G చిప్‌సెట్, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ టెక్నాలజీ మద్దతుతో 5,000mAh బ్యాటరీ వంటి ఫీచర్లను కలిగిన పోకో M2 ప్రో గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

పోకో M2 ప్రో ధరల వివరాలు

పోకో M2 ప్రో ధరల వివరాలు

పోకో M2 ప్రో స్మార్ట్‌ఫోన్‌‌ బ్లూ, గ్రీన్ మరియు మరియు షేడ్స్ బ్లాక్ వంటి మూడు కలర్ వేరియంట్ లలో మూడు వేరు వేరు స్టోరేజ్ విభాగాలలో లభిస్తుంది. ఇందులో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.13,999 కాగా 6GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999 మరియు చివరిది హై-ఎండ్ వేరియంట్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.16,999.

పోకో M2 ప్రో స్మార్ట్‌ఫోన్ సేల్ ఆఫర్స్

పోకో M2 ప్రో స్మార్ట్‌ఫోన్ సేల్ ఆఫర్స్

ప్రముఖ ఇ-కామర్స్ ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫాంలో పోకో M2 ప్రో స్మార్ట్‌ఫోన్ను కొనుగోలు చేయడానికి చాలా రకాల డెబిట్ / క్రెడిట్ కార్డుల మీద గొప్ప తగ్గింపులను అందిస్తుంది. వీటిలో యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డుపై ఐదు శాతం తగ్గింపు, రుపే డెబిట్ కార్డు కొనుగోలుపై 75 రిబేటు మరియు ఫెడరల్ బ్యాంక్ డెబిట్ కార్డులపై 10 శాతం తక్షణ తగ్గింపు లభిస్తుంది.

పోకో M2 ప్రో స్నాప్‌డ్రాగన్ 720G సాఫ్ట్‌వేర్

పోకో M2 ప్రో స్నాప్‌డ్రాగన్ 720G సాఫ్ట్‌వేర్

పోకో M2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 6.7-అంగుళాల LCD డిస్‌ప్లేను 60HZ రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంటుంది. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 720G మరియు అడ్రినో 618 GPUతో రన్ అవుతూ 4GB/ 6GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్  స్టోరేజీతో జతచేయబడి వస్తుంది. ఈ ఫోన్ యొక్క సాఫ్ట్‌వేర్ అప్ డేట్ల విషయానికి వస్తే పోకో కొత్త కొత్త అప్ డేట్ లను అందిస్తుంది. ఫోన్ యొక్క ముందు భాగంలో పంచ్-హోల్ సెటప్ లోపల 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఇందులో గల సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ద్వారా సులభంగా ఫోన్ ను అన్ లాక్ చేయవచ్చు.

పోకో M2 ప్రో 48 మెగాపిక్సెల్ కెమెరా సెటప్

పోకో M2 ప్రో 48 మెగాపిక్సెల్ కెమెరా సెటప్

పోకో M2 ప్రో స్మార్ట్‌ఫోన్ యొక్క వెనుకభాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ మెయిన్ షూటర్‌ కెమెరా , 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెకండరీ కెమెరా, 5-మెగాపిక్సెల్ మాక్రో మరియు 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాల‌తో జత చేయబడి ఉన్నాయి. ఈ ఫోన్ స్ప్లాష్ ప్రూఫ్ తో పనిచేస్తుంది. అలాగే ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో 5,020mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంది.  

పోకో M2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ కనెక్టివిటీ ఎంపికలు

పోకో M2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ కనెక్టివిటీ ఎంపికలు

పోకో M2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 33W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మద్దతుతో 5,000W బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌లోని కనెక్టివిటీ ఎంపికల విషయానికి వస్తే ఇందులో 4G వోల్‌టిఇ, వై-ఫై 802.11 AC, బ్లూటూత్ 5.0, జిపిఎస్ / ఎ-జిపిఎస్, యుఎస్‌బి టైప్-సి మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Poco M2 Pro Smartphone Sale Starts Today in India via Flipkart at 12PM
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X