Poco M2 Pro సేల్: అద్భుతమైన క్యాష్‌బ్యాక్ ఆఫర్లు!! త్వరపడండి...
ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమి యొక్క సబ్- బ్రాండ్ గా స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తున్న పోకో సంస్థ గత నెలలో కొత్తగా మరొక ఫోన్ పోకో M2ప్రోను విడుదల చేసింది. ఈ ఫోన్ ఇండియాలో విడుదలైనప్పటి నుండి ఫ్లాష్ సేల్స్ ద్వారా మాత్రమే అందుబాటులోకి వచ్చింది. కానీ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రత్యేకంగా దీని యొక్క సేల్ నిర్వహించబడుతోంది. దీని యొక్క అమ్మకాలు మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమవుతుంది. 5,000mAh బ్యాటరీ మరియు 48 మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్ మరియు స్నాప్‌డ్రాగన్ 720G SOC వంటి ఫీచర్లను కలిగి ఉన్న ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

పోకో M2ప్రో ధర మరియు సేల్ ఆఫర్స్
పోకో M2ప్రో ఇండియాలో మూడు వేరియంట్‌లలో లభిస్తుంది. ఇందులో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.13,999 కాగా 6GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999 కాగా 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.16,999. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా జరిగే అమ్మకంలో ఈ ఫోన్ అవుట్ ఆఫ్ ది బ్లూ, గ్రీన్ మరియు గ్రీనర్, మరియు టూ షేడ్స్ ఆఫ్ బ్లాక్ వంటి మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అమ్మకపు ఆఫర్లలో యాక్సిస్ బ్యాంక్ బజ్ కార్డు మీద ఐదు శాతం తక్షణ డిస్కౌంట్ మరియు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు మీద ఐదు శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అలాగే నెలకు రూ.1,556లతో EMI పద్దతిలో ఫోన్ ను కొనుగోలు చేయడానికి అద్భుత అవకాశం కూడా అందిస్తోంది.

పోకో M2 ప్రో 60HZ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే స్పెసిఫికేషన్స్
పోకో M2 ప్రో స్మార్ట్‌ఫోన్ 60HZ రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 720G మరియు అడ్రినో 618 GPUతో పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్ 4GB/ 6GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజీతో జతచేయబడి వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 10 ఆధారిత MIUI 11 తో రన్ అవుతుంది. సాఫ్ట్‌వేర్ యొక్క అప్ డేట్ల విషయానికి వస్తే పోకో కొత్త కొత్త అప్ డేట్ లను అందిస్తుంది. ఫోన్ యొక్క ముందు భాగంలో పంచ్-హోల్ సెటప్ లోపల 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఇందులో గల సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ద్వారా సులభంగా ఫోన్ ను అన్ లాక్ చేయవచ్చు.

పోకో M2 ప్రో క్వాడ్ రియర్ కెమెరా సెటప్
పోకో M2 ప్రో స్మార్ట్‌ఫోన్ యొక్క వెనుకభాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ మెయిన్ షూటర్ కెమెరా , 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెకండరీ కెమెరా, 5-మెగాపిక్సెల్ మాక్రో మరియు 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలతో జత చేయబడి ఉన్నాయి. ఈ ఫోన్ స్ప్లాష్ ప్రూఫ్ తో పనిచేస్తుంది. అలాగే ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంది.

పోకో M2 ప్రో 5,000mAh బ్యాటరీ కనెక్టివిటీ
పోకో M2 ప్రో స్మార్ట్‌ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. అలాగే ఫోన్ యొక్క కనెక్టివిటీ ఎంపికల విషయానికి వస్తే ఇందులో 4G VoLTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ v5.0, GPS / A-GPS, USB టైప్-C మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి. బోర్డులో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది.


Click it and Unblock the Notifications