Realme 9i 5G vs Poco M4 Pro 5G: రెండు బ‌డ్జెట్‌ మొబైల్స్‌లో ఏది బెస్ట్‌!

|

Realme కంపెనీ భార‌త మార్కెట్లో బడ్జెట్ 5G ఫోన్ Realme 9i 5Gని ఆగస్టు 18న విడుదల చేసింది. తక్కువ ధరకే మంచి స్పెసిఫికేషన్స్‌తో ఈ మొబైల్ వ‌స్తున్న‌ట్లు విశ్లేష‌కులు చెబుతున్నారు. ఇదే స‌మ‌యంలో, ఈ ఫోన్ Poco M4 Pro 5G ప్ర‌త్య‌క్ష పోటీదారుగా కనిపిస్తుంది. రెండూ కూడా బ‌డ్జెట్ ధ‌ర‌లోనే స‌మాన‌మైన ఫీచ‌ర్ల‌ను క‌లిగి ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు మొబైల్స్‌లో ఏది బెస్టో ఒకసారి అన్ని వివ‌రంగా ప‌రిశీలిద్దాం.

POCO M4 Pro 5G vs Realme 9i

మీరు కూడా 15 వేల లోపు 5G ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, ఈ ఆర్టిక‌ల్ మీకోసమే. Realme 9i 5G vs Poco M4 Pro 5Gలో ఏ ఫోన్ ప్రత్యేకమైనదో మరియు మీరు పొందబోయే ఫీచర్లు ఏమిటో మేము ఇందులో మీకు తెలియజేస్తున్నాం. మీరూ దీనిపై ఓ లుక్కేయండి.

Realme 9i 5G vs Poco M4 Pro 5G ధ‌ర‌లు:
* Realme 9i 5G మెటాలిక్ గోల్డ్, రాకింగ్ బ్లాక్ మరియు సోల్‌ఫుల్ బ్లూ రంగులలో భార‌త మార్కెట్లో అందుబాటులో ఉండ‌నుంది. ఇవి భార‌త మార్కెట్లో ర్యామ్ ఆధారంగా రెండు వేరియంట్ల‌లో ల‌భించ‌నున్నాయి. ధ‌ర విష‌యానికొస్తే.. 4GB RAM, 64GB స్టోరేజ్ ధర రూ.13,999 మరియు 6GB RAMతో 128 GB స్టోరేజ్ ధర రూ.15,999 గా నిర్ణ‌యించారు.

* మరోవైపు, Poco మొబైల్ విష‌యానికొస్తే, Poco M4 Pro 5G కూల్ బ్లూ, పోకో ఎల్లో మరియు పవర్ బ్లాక్ కలర్‌లలో అందుబాటులోకి వచ్చింది. వి భార‌త మార్కెట్లో ర్యామ్ ఆధారంగా రెండు వేరియంట్ల‌లో ల‌భించ‌నున్నాయి. ధ‌ర విష‌యానికొస్తే.. 4GB RAM, 64GB స్టోరేజ్ ధర రూ.14,999 మరియు 6GB RAMతో 128GB స్టోరేజ్ ధర రూ.16,999 గా నిర్ణ‌యించారు. ఇక 8జీబీ ర్యామ్‌తో కూడిన 128 జీబీ స్టోరేజ్ ధర రూ.18,999 గా నిర్ణ‌యించారు.

POCO M4 Pro 5G vs Realme 9i

Realme 9i 5G vs Poco M4 Pro 5G ప్ర‌ధాన స్పెసిఫికేష‌న్లు:
Realme 9i 5G ఆండ్రాయిడ్ 12 ఆధారిత UI 3.0 ఓఎస్‌పై ర‌న్ అవుతుంది. ఈ మొబైల్ 6.6-అంగుళాల ఫుల్ HD ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్, (1,080x2,400 పిక్సెల్‌లు) రిజల్యూషన్ క‌లిగి ఉంది. అంతేకాకుండా, ఇది 400 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. Realme 9i 5G మొబైల్‌కు ఆక్టా-కోర్ MediaTek డైమెన్షన్స్ 810 ప్రాసెసర్ అందిస్తున్నారు. 6GB వరకు LPDDR4X RAM ద్వారా శక్తిని పొందుతుంది.

* మరోవైపు, Poco విష‌యానికొస్తే.. Poco M4 Pro 5G మొబైల్ Android 11 ఆధారిత MIUI 12.5 ఓఎస్‌పై ర‌న్ అవుతుంది. ఈ మొబైల్ 6.6-అంగుళాల పూర్తి HD ప్లస్ డాట్ నాచ్ డిస్‌ప్లేను కలిగి ఉంది, ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఫోన్‌లో MediaTek Dimensity 810 ప్రాసెసర్ ఉంది, 8 GB వరకు LPDDR4X RAM మరియు 128GB వరకు స్టోరేజీ ని క‌లిగి ఉంది.

ట్రిపుల్ కెమెరా సెటప్ మరియు డ్యూయల్ కెమెరా సెటప్:
Realme 9i 5G ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది, ఇది f/1.8 ఎపర్చర్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్ తో వ‌స్తోంది. మ‌రో రెండు కెమెరాలు డెప్త్ మరియు మాక్రో సెన్సార్ తో వ‌స్తున్నాయి. ఇక‌, సెల్ఫీల కోసం ఫోన్‌లో 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా (f/2.0 ఎపర్చరు) కూడా ఉంది.

POCO M4 Pro 5G vs Realme 9i

* అదే సమయంలో, Poco M4 Pro 5G డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో అందుబాటులో ఉంది. దీనిలో ప్రైమరీ లెన్స్ 50 మెగాపిక్సెల్స్ మరియు రెండవ లెన్స్ 8 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్ యాంగిల్ అందిస్తున్నారు. ఫోన్ ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ కెమెరా ఇవ్వబడింది.

Realme 9i 5G మొబైల్‌కు 5000mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాటరీని అందిస్తున్నారు. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. దీనితో పాటు, ఫోన్‌లో భద్రత కోసం ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అందుబాటులో ఉంది. Poco M4 Pro 5G మొబైల్‌కు కూడా 5000mAh బ్యాటరీని ఇస్తున్నారు.. మరియు ఇది 33W ప్రో ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇవ్వబడింది.

Best Mobiles in India

English summary
POCO M4 Pro 5G vs Realme 9i comparision

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X