50MP కెమెరా, 33W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ తో, కొత్త Poco ఫోన్! తక్కువ ధర లోనే ..!

By Maheswara
|

భారతదేశ మొబైల్ మార్కెట్‌లో పోకో కంపెనీ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇది వివిధ మోడల్స్ స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇది తన బడ్జెట్ ధర స్మార్ట్‌ఫోన్‌లతో వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం, భారతీయ మార్కెట్లో కొత్త Poco M5 స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేయడానికి ప్లాన్ చేస్తోంది. సెప్టెంబర్ నెలలో ఈ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో లాంచ్ కాబోతోందని నివేదికలు చెప్తున్నాయి.

సెప్టెంబర్ ప్రారంభంలో

సెప్టెంబర్ ప్రారంభంలో

అవును, Poco కంపెనీ యొక్క కొత్త Poco M5 స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ ప్రారంభంలో భారతదేశంలో లాంచ్ చేయబడుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే చాలా అంచనాలను సృష్టించింది మరియు ఈ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి,ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Helio G99 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 5,000mAh బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉంది. రాబోయే, ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీరు ఎలాంటి ఫీచర్లను ఆశించవచ్చో తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.

Display సైజ్ ఎంత?

Display సైజ్ ఎంత?

Poco M5 స్మార్ట్‌ఫోన్ 6.58 అంగుళాల పూర్తి HD ప్లస్ LCD డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ డిస్ప్లే 1080 x 2400 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఇది 60 Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఇది 394 ppi పిక్సెల్ సాంద్రతను కలిగి ఉంటుంది మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణను కలిగి ఉన్నట్లు నివేదించబడింది.

ఏ ప్రాసెసర్ తో వస్తుంది?

ఏ ప్రాసెసర్ తో వస్తుంది?

Poco M5 స్మార్ట్‌ఫోన్ MediaTek Helio G99 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 12 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌ రన్ అవుతుందని చెప్పబడింది. ఇది 6 GB RAM మరియు 64 GB ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంటుందని కూడా అంచనా వేయబడింది. అంతేకాకుండా, మెమరీ కార్డ్ ద్వారా స్టోరేజీ సామర్థ్యాన్ని 512 GB వరకు పెంచుకోవచ్చు.

కెమెరా సెటప్ ఎలా ఉంటుంది?

కెమెరా సెటప్ ఎలా ఉంటుంది?

ఈ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది.మెయిన్ కెమెరాలో 50-మెగాపిక్సెల్ సెన్సార్, 2-మెగాపిక్సెల్ సెన్సార్‌తో రెండవ కెమెరా మరియు 2-మెగాపిక్సెల్ సెన్సార్‌తో మూడవ కెమెరా ఉండే అవకాశం ఉంది.ఇంకా, 8 మెగాపిక్సెల్ సెన్సార్‌తో కూడిన సెల్ఫీ కెమెరాను కూడా కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

బ్యాటరీ బ్యాకప్ వివరాలు? మరియు ధర ఎంత ఉంటుంది?

బ్యాటరీ బ్యాకప్ వివరాలు? మరియు ధర ఎంత ఉంటుంది?

Poco M5 స్మార్ట్‌ఫోన్ 5,000mAh బ్యాటరీతో 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇతర కనెక్టివిటీ ఎంపికలలో 4G, VoLTE, బ్లూటూత్ v5.0, WiFi, USB-C v2.0, IR బ్లాస్టర్ ఉన్నాయి. భారతదేశంలో Poco M5 స్మార్ట్‌ఫోన్ ధర రూ.15,000 లోపల లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను సెప్టెంబర్ తొలివారంలో భారత్‌లో విడుదల చేయనున్నట్లు సమాచారం.

Poco F4 5G స్మార్ట్‌ఫోన్‌

Poco F4 5G స్మార్ట్‌ఫోన్‌

అంతేకాకుండా, Poco కంపెనీ ఇటీవల భారతదేశంలో కొత్త Poco F4 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ 6.67-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది Qualcomm Snapdragon 870 SoC ప్రాసెసర్‌ని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కూడా ఉంది. ప్రధాన కెమెరాలో 64 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. ఇందులో 4,500mAh బ్యాటరీ కూడా ఉంది. ఇది 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. స్మార్ట్‌ఫోన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో HDR10 ప్లస్ మరియు నెట్‌ఫ్లిక్స్‌లో డాల్బీ విజన్‌కు మద్దతు ఇస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ అట్మోస్ మరియు డాల్బీ విజన్ టెక్నాలజీకి కూడా మద్దతు ఇస్తుంది.

Best Mobiles in India

Read more about:
English summary
Poco M5 4G Expected To Launch In September First Week In India. Everything We Know So Far.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X