రూ.13వేల లోపు ధ‌ర‌లో Poco M5 విడుద‌ల‌.. ఆఫ‌ర్ల కోసం చూడండి!

|

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ ఉత్ప‌త్తుల త‌యారీ సంస్థ Poco, ఎప్ప‌టిక‌ప్పుడూ స‌రికొత్త మోడ‌ల్ మొబైల్స్‌ను భార‌త మార్కెట్లో విడుద‌ల చేస్తోంది. తాజాగా బ‌డ్జెట్ ధ‌ర‌లో మ‌రో కొత్త కొత్త 4G స్మార్ట్‌ఫోన్‌ను భార‌త మార్కెట్‌కు ప‌రిచ‌యం చేసింది. Poco M5 పేరుతో వ‌స్తున్న ఈ కొత్త మోడ‌ల్ బ‌డ్జెట్ అనుకూల ధ‌ర‌లోనే అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను క‌లిగి ఉంది.

 
రూ.13వేల లోపు ధ‌ర‌లో Poco M5 విడుద‌ల‌.. ఆఫ‌ర్ల కోసం చూడండి!

డిజైన్ ప‌రంగా చూస్తే.. ఈ మొబైల్ కంపెనీ నుంచి గ‌తంలో విడుద‌లైన Poco M4 Pro 5G మాదిరిగానే ఆక‌ర్ష‌ణీయంగా ఉంది. Poco స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ MediaTek Helio G99 SoC ప్రాసెస‌ర్‌ను క‌లిగి ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 5000mAh బ్యాటరీతో సహా అనేక గొప్ప ఫీచ‌ర్ల‌తో వ‌చ్చింది. ఇప్పుడు ఈ మొబైల్‌కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేష‌న్లు, ఫీచ‌ర్లు, ధ‌ర‌ల వివ‌రాలు తెలుసుకుందాం.

భార‌త మార్కెట్లో Poco M5 4G ధ‌ర‌, మ‌రియు ల‌భ్య‌త‌:
Poco M5 4G స్మార్ట్‌ఫోన్ భార‌త మార్కెట్లో ర్యామ్‌, స్టోరేజీ కెపాసిటీల ఆధారంగా రెండు వేరియంట్‌లలో వస్తోంది. 4GB RAM + 64GB ROM మరియు 6GB RAM + 128GB ROM వేరియంట్లుగా ఉంటాయి. అయితే, ఈ వేరియంట్‌ల ధరలు వరుసగా రూ.12,499 మరియు రూ.14,499 గా నిర్ణ‌యించారు. స్మార్ట్‌ఫోన్ పవర్ బ్లాక్, ఐసీ బ్లూ మరియు పోకో ఎల్లో వంటి మూడు క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో వస్తుంది. Poco స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 13 నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు దారుల‌కు సేల్‌కు అందుబాటులోకి రానుంది.

రూ.13వేల లోపు ధ‌ర‌లో Poco M5 విడుద‌ల‌.. ఆఫ‌ర్ల కోసం చూడండి!

రాబోయే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ సమయంలో, Poco M5 4G పై కొనుగోలుదారులు ICICI లేదా Axis బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగిస్తే రూ.1,500 త‌క్ష‌ణ త‌గ్గింపును పొందుతారు. అదేవిధంగా, కంపెనీ మొబైల్‌పై డిస్నీ+ హాట్‌స్టార్‌కు ఉచిత వార్షిక సభ్యత్వాన్ని అందిస్తోంది. అంతేకాకుండా, కొనుగోలు చేసిన తేదీ నుండి మొదటి ఆరు నెలల పాటు ఉచిత స్క్రీన్ ప్రొటెక్ష‌న్‌ను కూడా అందిస్తుంది.

Poco M5 4G ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:
Poco M5 4G మొబైల్ (2400 x 1080 పిక్సెల్‌) FHD+ రిజల్యూషన్‌తో, 6.58-అంగుళాల IPS LCD డిస్‌ప్లేను క‌లిగి ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో ప‌ని చేస్తుంది. డిస్‌ప్లే పైభాగంలో 8MP సెల్ఫీ కెమెరా సెన్సార్‌ని ఉంచడానికి వాటర్‌డ్రాప్ కటౌట్ ఉంది. Poco స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ MediaTek Helio G99 SoC ప్రాసెస‌ర్‌ను క‌లిగి ఉంది. ఇది RAM సామర్థ్యాన్ని మరింత విస్తరించడానికి Turbo RAMకి స‌పోర్టుతో గరిష్టంగా 6GB RAM మరియు 128GB వరకు ఇంట‌ర్న‌ల్ స్టోరేజీని అందిస్తున్నారు.

రూ.13వేల లోపు ధ‌ర‌లో Poco M5 విడుద‌ల‌.. ఆఫ‌ర్ల కోసం చూడండి!

ఇక కెమెరాల విష‌యానికొస్తే.. Poco M5 4G మొబైల్‌కు బ్యాక్‌సైడ్ ఎల్ఈడీ ఫ్లాష్ క‌లిగిన ట్రిపుల్ కెమెరా సెట‌ప్‌ను అందిస్తున్నారు. ప్రైమ‌రీ కెమెరా 50 మెగా పిక్సెల్ క్వాలిటీ క‌లిగి ఉంది. ఇక 2MP క్వాలిటీతో సెకండరీ మాక్రో సెన్సార్ మరియు 2MP క్వాలిటీతో మూడోది డెప్త్ సెన్సార్‌ల‌ను అందిస్తున్నారు.

 

కనెక్టివిటీ విష‌యానికొస్తే.. 5G SA/NSA, 4G LTE, బ్లూటూత్ 5, Wi-Fi, GPS, ఒక IR బ్లాస్టర్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ మరియు USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. 5000mAh శ‌క్తివంత‌మైన బ్యాటరీ Poco M5 4Gకి శక్తినిస్తుంది మరియు 18W ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్టు క‌లిగి ఉంది. ఇది ఒక ఛార్జ్‌పై రెండు రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. రిటైల్ ప్యాకేజీ 22.5W ఛార్జర్‌తో వ‌స్తోంది. ఇది MIUI 13 ఆధారిత‌ Android 12 ఓఎస్‌పై ర‌న్ అవుతుంది.

Best Mobiles in India

English summary
Poco M5 4G Launched In India With 90Hz Display, 50MP Camera And More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X