108MP కెమెరా, 33W ఛార్జింగ్ సపోర్టుతో పోకో స్మార్ట్‌ఫోన్ విడుదల తేదీ ఖరారు.. పూర్తి వివరాలు..!!
పోకో నుంచి త్వరలో పోకో M6 4G వేరియంట్ (Poco M6 4G Smartphone) భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ హ్యాండ్ సెట్ 5G వేరియంట్ భారత్ మార్కెట్ లో అందుబాటులో ఉంది. అయితే 5G వేరియంట్ కంటే 4G వేరియంట్ డిజైన్ లో కొన్ని మార్పులతో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. పోకో M6 4G వేరియంట్‌ను జూన్ 11న లాంచ్ చేయనున్నట్లు సంస్థ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రకటన చేసింది. దీంతోపాటు సేల్ వివరాలను వెల్లడించింది.
పోకో M6 4G స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. 6GB ర్యామ్ +128GB స్టోరేజీ మరియు 8GB ర్యా్మ్ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 6GB ర్యామ్ ధర $129 (భారత కరెన్సీలో రూ.10,773), అదే 8GB ర్యామ్ ధర $149 (భారత కరెన్సీలో 12,444) గా ఉంది. దీంతోపాటు ఈ పోకో M6 4G వేరియంట్ మూడు కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.

అయితే పోకో M6 4G స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్ లు, ఫీచర్ ల కోసం సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు. 108MP ప్రో గ్రేడ్ కెమెరా సహా 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు ను కలిగి ఉండనున్నాయని తెలుస్తోంది. దీంతోపాటు రెడ్‌మి 13 4G తరహా స్పెసిఫికేషన్ లను కలిగి ఉండే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రెడ్‌మి 13 4G హ్యాండ్ సెట్ 6.7 అంగుళాల LCD పుల్ HD + ప్యానల్ మరియు 90Hz రీఫ్రెష్ రేట్ ను కలిగి ఉంటుంది. దీంతోపాటు మీడియాటెక్ హీలియో G91 అల్ట్రా చిప్‌సెట్ ను కలిగి ఉంది. దీంతోపాటు ఈ రెడ్‌మి స్మార్ట్ ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. 108MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంది.
ఈ రెడ్‌మి 13 4G స్మార్ట్ ఫోన్ 33W ఛార్జింగ్ సపోర్టుతో 5030mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ హ్యాండ్ సెట్ 8.17mm థిక్ నెస్ మరియు 198.5 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. పోకో M6 4G వేరియంట్ ఇదే తరహా స్పెసిఫికేషన్ లను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. పోకో సంస్థ ఈ స్పెసిఫికేషన్ లు, ఫీచర్ లపై ఎటువంటి ప్రకటన చేయలేదు.
గిజ్ బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటి కప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








