Home
Mobile

Poco స్మార్ట్‌ఫోన్ల కొత్త వేరియంట్లు విడుదల... స్పెసిఫికేషన్లు, ధర, సేల్‌ వివరాలు..!

పోకో M6 5G ( Poco M6 5G ), పోకో C65 ( Poco C65 Smartphone ) స్మార్ట్‌ఫోన్లు గత సంవత్సరం డిసెంబర్‌లో భారత్‌ మార్కెట్‌లో లాంచ్‌ అయ్యాయి. తాజాగా ఈ సంస్థ ఆయా హ్యాండ్‌సెట్ల కొత్త వేరియంట్లను విడుదల చేసింది. ఈ రెండు ఫోన్లు ఇప్పటి నుంచి గ్రీన్ కలర్‌ వేరియంట్‌లోనూ అందుబాటులో ఉండనున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు.

పోకో M6 5G మరియు పోకో C65 స్మార్ట్‌ఫోన్లు ( Poco Smartphones New Variants 2024 ) ప్రముఖ ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌ ( Flipkart ) ద్వారా భారత్‌లో అందుబాటులో ఉండనున్నాయి. పోకో C65 స్మార్ట్‌ఫోన్ మ్యాటీ బ్లాక్‌, పాస్టల్‌ బ్లూ, పాస్టల్‌ గ్రీన్‌ రంగుల్లో అందుబాటులో ఉంది. అదే పోకో M6 5G గ్రీన్‌తోపాటు గలాస్టిక్‌ బ్లాక్‌, ఓరియన్‌ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంటుంది.

poco m6 5g and poco c65 smartphones new variants launched

పోకో M6 5G స్మార్ట్‌ఫోన్‌ ధర : పోకో M6 5G స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్‌ +128GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.10,499గా ఉంది. అదే 6GB ర్యామ్‌ +128GB స్టోరేజీ వేరియంట్‌ రూ.11,499గా, మరియు 8GB ర్యామ్‌ +256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.13,499 గా ఉంది.

పోకో C65 స్మార్ట్‌ఫోన్‌ ధర : అదే పోకో C65 స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్ +128GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.8,499 గా ఉంది. 6GB ర్యామ్ +128GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.9499 మరియు 8GB ర్యామ్‌ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.10999గా ఉంది.

పోకో M6 5G, పోకో c65 స్మార్ట్‌ఫోన్ల స్పెసిఫికేషన్లు : ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు 6.74 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. 720*1600 పిక్సల్‌ రిజల్యూషన్‌, 90Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉన్నాయి. పోకో M6 5G మీడియాటెక్‌ డైమెన్సిటీ 6100+ చిప్‌సెట్‌, పోకో C65 స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్‌ హీలియో G85 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు 18W వైరడ్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.

పోకో M6 5G స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP ప్రధాన కెమెరా సహా మరో కెమెరా ఉంటుంది, మరియు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. పోకో C65 వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాను కలిగి ఉంటుంది. 50MP ప్రధాన కెమెరా సహా మిగిలిన కెమెరాలను కలిగి ఉంటుంది. మరియు 5MP సెల్ఫీ కెమెరా ఉంటుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
poco m6 5g and poco c65 smartphones new variants launched
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X