Home
Mobile

Poco నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌.. 50MP AI కెమెరా, 5000mAh బ్యాటరీ..!!

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ల తయారీ సంస్థ పోకో నుంచి కొత్త హ్యాండ్‌సెట్ ఈ వారంలో భారత్‌ మార్కెట్‌లో విడుదల కానుంది. పోకో M సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ Poco M6 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదలపై తన సోషల్‌ మీడియా వేదికల ద్వారా పోకో సంస్థ తెలియ జేసింది.

విడుదల ఎప్పుడంటే : ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను షేర్‌ చేసింది. ఈ ఫోన్ ముందువైపు వాటర్‌డ్రాప్‌ నాచ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ రెడ్‌మీ 13c రీబ్రాండెడ్‌ వెర్షన్‌ అని వార్తలు వస్తున్నాయి. డిసెంబర్‌ 22న పోకో M6 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తామని తెలిపింది.

poco M6 5G

ఇందుకు సంబంధించిన లాంచ్‌ ఈవెంట్‌ డిసెంబర్‌ 22 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అవుతుందని తెలిపింది. టీజర్‌ ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్‌ AI (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్) ఆధారిత కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇందులో 50MP ప్రధాన కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా అందుబాటులోకి.. : పోకో M6 5G స్మార్ట్‌ ఫోన్‌ కోసం ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ సంస్థ ప్రత్యేక పేజీని క్రియేట్‌ చేసింది. బ్లాక్‌, సిల్వర్‌ రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. పోకో M5 స్మార్ట్‌ ఫోన్ గత సెప్టెంబర్‌లో విడుదల అయింది. ఈ ఫోన్‌ తర్వాత తరం హ్యాండ్‌సెట్‌గా పోకో M6 విడుదల అవుతోంది.

poco M6 5G

రెడ్‌మీ 13c 5G స్మార్ట్‌ఫోన్‌కు రీబ్రాండెడ్ వెర్షన్‌ ..? : అయితే ఈనెల తొలి రోజుల్లో విడుదలైన రెడ్‌మీ 13c 5G స్మార్ట్‌ఫోన్‌కు రీబ్రాండెడ్‌ వెర్షన్‌గా పోకో M6 5G స్మార్ట్‌ ఫోన్‌ విడుదల అవుతుందని తెలుస్తోంది. రెడ్‌మీ 13C 5G హ్యాండ్‌సెట్‌ 4GB ర్యామ్‌, 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.9999గా ఉంది.

రెడ్‌మీ 13c 5G స్పెసిఫికేషన్లు : రెడ్‌మీ 13C 5G స్మార్ట్‌ఫోన్ 6.74 అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 90Hz డిస్‌ప్లే రీఫ్రెష్‌ రేట్‌తో వస్తుంది. ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6100+ SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. మరియు 8 GB ర్యామ్‌, 256GB స్టోరేజీతో జతచేయబడుతుంది. ఈ ఫోన్‌ వెనుకవైపు డ్యూయల్‌ కెమరాను కలిగి ఉంటుంది.

ఇందులో 50MP ప్రైమరీ కెమెరా సహా డె‌ప్త్‌ సెన్సార్‌తో వస్తుంది. మరియు 5MP సెల్పీ కెమెరాను అమర్చారు. మరియు 18W ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 4GB, 6 GB, 8 GB ర్యామ్ వేరియంట్లో లభిస్తుంది. 128 GB, 256 GB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
poco M6 5G Smartphone will be launching on December 22 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X