Home
Mobile

పోకో M6 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌, బడ్స్‌ X1 కీలక ఫోటోలు లీక్‌.. ఆగస్టు 1న భారత్‌ మార్కెట్లోకి విడుదల..!

పోకో నుంచి బడ్స్ X1 మరియు M6 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ మార్కెట్‌లో ఆగస్టు 1వ తేదీన విడుదల కానున్నాయి. ఈ రెండు ఉత్పత్తులకు సంబంధించిన టీజర్‌ను పోకో సంస్థ ఇటీవల విడుదల చేసింది. ఈ టీజర్‌ ద్వారా డిజైన్‌ సహా ముఖ్యమైన ఫీచర్‌ల వివరాలు వెల్లడయ్యాయి. తాజాగా పోకో కొత్త స్మార్ట్‌ఫోన్ (Poco M6 Plus 5G), ఇయర్‌బడ్స్‌ (Poco Buds X1) రిటైల్‌ బాక్స్‌ల ఫోటోలు లీక్ అయ్యాయి. పోకో M6 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి 13 5G హ్యాండ్‌సెట్‌కు రీబ్రాండెడ్‌గా అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

టిప్‌స్టర్‌ యోగేష్‌ తన X ప్లాట్‌ఫాం ద్వారా పోకో M6 ప్లస్‌, బడ్స్‌ X1 రిటైల్‌ బాక్స్‌ ఫోటోలను షేర్‌ చేశారు. ఈ ఫోటోల ఆధారంగా పోకో ఫోన్‌ కెమెరా మాడ్యూల్‌ రెడ్‌మి 13 5G తరహాలోనే ఉంది. లీక్‌ అయిన ఫోటోలో పోకో M6 ప్లస్‌ ఫోన్‌ బ్లూ కలర్‌ను కలిగి ఉంది. దీంతోపాటు బ్లాక్‌, పర్పుల్‌ రంగుల్లోనే అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

Poco M6 Plus 5G Smartphone and Buds X1 key details leaked

పోకో M6 ప్లస్‌ 5G అంచనా స్సెఫికేషన్లు :
పోకో ప్లస్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ 6.8 అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ వెనుకవైపు డ్యూయల్‌ కెమెరాను కలిగి ఉంటుంది. ఇందులో 3X జూమ్‌ సామర్థ్యంతో 108MP ప్రైమరీ కెమెరాను అమర్చారు. మరియు ఇతర కెమెరాల వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ 5030mAh బ్యాటరీ పైన పనిచేస్తుంది. అయితే ఛార్జింగ్ సామర్థ్యానికి సంబంధించిన వివరాలు వెల్లడి కాలేదు. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ స్నాప్‌ డ్రాగన్‌ 4 జెన్‌ 2 AE చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. OS వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ హ్యాండ్‌సెట్ ధర, సేల్ వివరాలు ఆగస్టు 1న విడుదల సమయంలో తెలియనున్నాయి.

పోకో బడ్స్‌ X1 విషయానికి వస్తే లీక్‌ అయిన వివరాల ఆధారంగా ఈ బడ్స్‌ తెలుపు రంగులో ఉన్నాయి. మరియు మాగ్నటిక్‌ ఛార్జింగ్‌ కేస్‌ లోపలి భాగం పసుపు రంగుల్లో ఉంది. దీంతోపాటు బ్యాటరీ ఛార్జింగ్‌ స్థితి తెలుసుకొనేందుకు LED లైట్‌ స్ట్రిప్‌ను కలిగి ఉంది. ఈ పోకో ఇయర్‌బడ్స్‌ను షియోమీ ఇయర్‌బడ్స్‌ యాప్‌ ద్వారా నియంత్రించవచ్చు.

ఈ పోకో బడ్స్‌ X1 ఇయర్‌బడ్స్‌ ఇన్ ఇయర్‌ డిజైన్‌ సిలికాన్‌ టిప్స్‌, 12.4 డైనమిక్‌ టైటానియం డ్రైవర్‌లను కలిగి ఉంటాయి. దీంతోపాటు 40dB వరకు హైబ్రిడ్‌ యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ (ANC) ఫీచర్‌తో క్వాడ్ మైక్‌లను కలిగి ఉంటుంది. మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఎన్విరాన్‌మెంటల్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ ఫీచర్‌ (ENC) పైన పనిచేస్తుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Poco M6 Plus 5G Smartphone and Buds X1 key details leaked ahead of launch on august 1st in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X