Home
Mobile

ధర రూ.10,499 కే 108MP కెమెరా, 5030mAh బ్యాటరీ, 6.79 అంగుళాల FHD+ డిస్‌ప్లే 5G స్మార్ట్‌ఫోన్‌..!

భారత్‌ మార్కెట్‌లో 2024 ఆగస్టు నెలలో పోకో M6 ప్లస్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ (Poco M6 Plus 5G Smartphone) విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ 108MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. మరియు ఈ ఫోన్ 4 సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందుతుందని సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌ లో డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది.దీంతోపాటు బ్యాంకు కార్డుల ద్వారా మరింత తగ్గింపు ధరకే ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

పోకో M6 ప్లస్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. విడుదల సమయంలో 6GB ర్యామ్ వేరియంట్‌ ధర రూ.11,999 గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.11,499 కే కొనుగోలు చేయవచ్చు.

poco M6 Plus 5G smartphone gets price drop

అదే 8GB ర్యామ్ ధర రూ.13,499 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.12,499 కే సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌లో భాగంగా అన్ని బ్యాంకుల డెబిట్‌, క్రెడిట్‌ కార్డులపై రూ.1,000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా బేస్‌ వేరియంట్‌ను రూ.10,499 కే సొంతం చేసుకోవచ్చు. మరియు ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్‌ బ్యాంకు కార్డు ద్వారా 5 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు.

పోకో M6 ప్లస్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ పూర్తి వివరాలు :
పోకో M6 ప్లస్‌ 5G స్మార్ట్‌ఫోన్ 6.79 అంగుళాల FHD+ (2400*1080 పిక్సల్స్‌) డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 550 నిట్స్‌ గరిష్ట బ్రైట్‌నెస్, 240Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్‌ 3 రక్షణను పొందుతుంది.

ఈ పోకో M6 ప్లస్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 4 జెన్‌ 2 AE SoC చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. గ్రాఫిక్స్‌ టాస్క్‌ల కోసం Adreno A613 GPU తో జతచేసి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత HyperOS తో పనిచేస్తుంది. 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు, 4 సంవత్సరాలపాటు సెక్యురిటీ అప్‌డేట్‌లు పొందనుందని సంస్థ తెలిపింది.

ఈ హ్యాండ్‌సెట్‌ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. అదనంగా 8GB ర్యామ్‌ ను వర్చువల్‌గా పెంచుకొనేందుకు అవకాశం ఉంది. ఈ ఫోన్‌ 33W వైర్‌ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5030mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

పోకో M6 ప్లస్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను అమర్చి ఉంది. F/1.75 అపేచర్‌, 3X ఇన్‌సెన్సార్‌ జూమ్‌ సపోర్టుతో 108MP శాంసంగ్‌ ISOCELL HM6 ప్రైమరీ కెమెరా, మరియు 2MP మ్యాక్రో కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియోల కోసం F/1.75 అపేచర్‌తో 13MP కెమెరాతో అందుబాటులోకి వచ్చింది.

ఈ రెండు కెమెరాలతో 30fps వద్ద 1080p మరియు 720p నాణ్యతతో వీడియోలను రికార్డు చేయవచ్చు. భద్రత కోసం ఈ ఫోన్‌ సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. మరియు IP53 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రిసిస్టెంట్‌గా ఉంది. 5G, 4G LTE, వైఫై 6, బ్లూటూత్‌ 5.0, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. మిస్టీ లావెండర్‌, గ్రాఫైట్‌ బ్లాక్‌, ఐస్‌ సిల్వర్‌ రంగుల్లో లభిస్తుంది.

Best Mobiles in India

English summary
poco M6 Plus 5G smartphone gets price drop on flipkart check specs and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X