Home
Mobile

108MP కెమెరా, 6.79 అంగుళాల డిస్‌ప్లేతో 5G స్మార్ట్‌ఫోన్‌.. విడుదల తేదీ, స్పెసిఫికేషన్‌ల వివరాలు..!

పోకో నుంచి M సిరీస్‌ లో మరో హ్యాండ్‌సెట్‌ లాంచ్‌ కానుంది. పోకో M6 ప్లస్ 5G పేరుతో (Poco M6 Plus 5G Smartphone) ఈ స్మార్ట్‌ ఫోన్ విడుదల కానుంది. ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌ ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. దీంతోపాటు ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్‌ సహా కొన్ని స్పెసిఫికేషన్‌ల వివరాలు తెలిశాయి. ముందువైపు పంచ్‌ హోల్ డిజైన్‌ ను కలిగి ఉంటుంది. మరియు ప్రధానంగా వెనుక వైపు 108MP కెమెరాతో అందుబాటులోకి వస్తుంది. ఈ పోకో M6 ప్లస్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ రెడ్‌మి నోట్‌ 13R హ్యాండ్‌సెట్‌కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా రానుందని సమాచారం.

ఈ పోకో M6 ప్లస్‌ 5G స్మార్ట్‌ ఫోన్‌ ఫ్లాట్‌ ఎడ్జ్‌లతో కూడిన డ్యూయల్‌ టోన్‌ డిజైన్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు పంచ్‌ హోల్‌ డిజైన్‌తో అందుబాటులోకి వస్తుంది. భారత్‌ మార్కెట్‌లో ఈ ఫోన్‌ ఆగస్టు 1వ తేదీన విడుదల కానుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.

Poco M6 Plus 5G Smartphone launch date confirmed in india

పోకో M6 ప్లస్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ అంచనా స్పెసిఫికేషన్‌లు :
ఈ పోకో M6 ప్లస్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.79 అంగుళాల LCD డిస్‌ప్లే ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత HyperOS ను కలిగి ఉంటుందని సమాచారం. తెలుస్తోంది. మరియు క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 4 జెన్‌ 2 ప్రాసెసర్ పైన పనిచేస్తుందని తెలుస్తోంది.

పోకో M6 ప్లస్‌ 5G స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. మరియు LED రింగ్‌ను కూడా గుర్తించవచ్చు. f/1.75 అపేచర్‌ మరియు 3X ఇన్‌ సెన్సార్‌ జూమ్ సామర్థ్యంతో 108MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఇతర కెమెరా వివరాలు వెల్లడి కావాల్సి ఉండగా.. 16MP సెల్ఫీ కెమెరాను అమర్చినట్లు తెలుస్తోంది.

Poco M6 Plus 5G Smartphone launch date confirmed in india

ఈ హ్యాండ్‌సెట్‌ 33W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టు తో 5030mAh బ్యాటరీని కలిగి ఉంటుందని ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ల లిస్టింగ్‌ ఆధారంగా తెలుస్తోంది. అయితే ర్యామ్‌, స్టోరేజీ వేరియంట్‌ ల వివరాలు తెలియాల్సి ఉంది. దీంతోపాటు కలర్ వేరియంట్ల సమాచారం కూడా వెల్లడి కావాల్సి ఉంది.

పోకో M6 ప్లస్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ ఫ్లిప్‌ కార్ట్‌ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఈ హ్యాండ్‌ సెట్ అమెజాన్‌ లోనూ లిస్టింగ్‌ అయింది. 8GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.14999 గా ఉంది. అయితే అమెజాన్‌ లో సేల్‌ సహా ధరలపై స్పష్టత రావాల్సి ఉంది.

Poco M6 Plus 5G Smartphone launch date confirmed in india

ఈ హ్యాండ్‌సెట్‌ రెడ్‌మి నోట్‌ 13R స్మార్ట్‌ఫోన్‌ కు రీబ్రాండెడ్‌ వెర్షన్‌గా లాంచ్‌ కానుందని తెలుస్తోంది. ఈ 13R స్మార్ట్‌ఫోన్‌ ఈ సంవత్సరం మే నెలలో చైనాలో విడుదల అయింది. చైనాలో ఈ హ్యాండ్‌సెట్ 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ ధర CNY 1399 (భారత కరెన్సీలో సుమారు రూ.16,000) గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Poco M6 Plus 5G Smartphone launch date confirmed in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X