Home
Mobile

ధర రూ.11999 కే 108MP కెమెరా 5G స్మార్ట్‌ఫోన్‌ సేల్‌ ప్రారంభం.. ఫీచర్‌లు, సేల్‌ వివరాలు..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ పోకో భారత్‌ మార్కెట్‌లో ఇటీవల పోకో M6 ప్లస్‌ 5G స్మార్ట్‌ఫోన్‌, బడ్స్‌ X1 ను లాంచ్‌ చేసింది. ఈ రెండు ఇవాళ్టి నుంచి కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. బ్యాంకు ఆఫర్లతో కలిపి ఈ స్మార్ట్‌ఫోన్‌ను (Poco M6 Plus 5G Smartphone Sale) రూ.11,999, బడ్స్‌ను రూ.1699 కే కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.79 అంగుళాల పుల్‌ HD+ LCD డిస్‌ప్లే, 108MP కెమెరాను కలిగి ఉంది. ఈ బడ్స్‌ సింగిల్‌ ఛార్జింగ్‌తో 36 గంటలపాటు వినియోగించుకోవచ్చు.

పోకో M6 ప్లస్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు :
ఈ స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.79 అంగుళాల FHD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 2400*1080 పిక్సల్‌ రిజల్యూషన్‌, 240Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే రక్షణకు కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్‌ 3 రక్షణ కలిగి ఉంటుంది. స్నాప్‌డ్రాగన్‌ 4 జెన్‌ 2 యాక్సెలిరేటెడ్‌ ఎడిషన్‌ చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది.

Poco M6 Plus 5G Smartphone sale offers

పోకో M6 ప్లస్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత HyperOS ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్‌ గరిష్ఠంగా 8GB ర్యామ్, 128GB స్టోరేజీతో జతచేయబడుతుంది. అదనంగా 8GB ర్యామ్‌ను వర్చువల్‌గా పొడిగించుకొనే అవకాశం ఉంది. నాలుగు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లు, రెండు ఆండ్రాయిడ్‌ అప్‌డేట్‌లను పొందవచ్చని పోకో వెల్లడించింది.

ఈ పోకో స్మార్ట్‌ఫోన్‌ రెండు స్టోరేజీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌లలో లభిస్తుంది. మరియు 33W వైర్ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5030mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

ఈ పోకో M6 ప్లస్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 108MP ప్రైమరీ కెమెరా + 2MP మ్యాక్రో కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియోల కోసం 13MP కెమెరాను అమర్చారు. ఈ రెండు కెమెరాలతో 30fps వద్ద 1080p మరియు 720p నాణ్యతతో వీడియోలను రికార్డు చేయవచ్చు.

ఫ్లిప్‌కార్ట్‌ ఆధారంగా ఈ ఫోన్‌ 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.13499 గా ఉంది. బ్యాంకు ఆఫర్లతో రూ.11,999 కే కొనుగోలు చేయవచ్చు. అదేవిధంగా 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,499 గా ఉండగా.. బ్యాంకు ఆఫర్లతో రూ.13,499 కే సొంతం చేసుకోవచ్చు. గ్రాఫైట్‌ బ్లాక్‌, ఐస్‌ సిల్వర్‌, మిస్టీ లావెండర్‌ రంగుల్లో లభిస్తుంది.

Poco M6 Plus 5G Smartphone sale offers

పోకో బడ్స్‌ X1 కూడా ఇవాళ్టి నుంచి సేల్‌ ప్రారంభం అయింది. ఈ బడ్స్ 12.4mm డైనమిక్‌ టైటానియం డ్రైవర్‌లను కలిగి ఉన్నాయి. ఇయర్‌బడ్స్‌ను ఒకసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి 36 గంటల ప్లేటైం సమయాన్ని పొందవచ్చు. ఈ బడ్స్‌ ధర రూ.1,699 గా ఉంది.

బ్యాగ్రౌండ్ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ కోసం 40dB హైబ్రిడ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ ఫీచర్‌ను కలిగి ఉంది. మరియు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత ఎన్విరాన్‌మెంటల్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ (ENC) ఫీచర్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు యాంటీ విండ్‌ నాయిస్‌ అల్గారిథమ్‌ను కూడా కలిగి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Poco M6 Plus 5G Smartphone sale is live on Flipkart specs and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X