Home
Mobile

పోకో నుంచి భారత్‌ మార్కెట్‌లోకి మరో కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌.. స్పెసిఫికేషన్‌లు, లాంచ్‌ వివరాలు..!!

పోకో నుంచి ఇటీవలే పోకో F6 5G స్మార్ట్‌ఫోన్ భారత్‌ మార్కెట్‌లోకి విడుదల అయింది. నిన్నటి నుంచి సేల్‌ కూడా ప్రారంభం అయింది. అయితే తాజాగా పోకో నుంచి మరో స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కానుందని తెలుస్తోంది. ఈ కొత్త ఫోన్ పోకో M6 ప్లస్‌ 5G.. ఇటీవల బ్యూరో ఆఫ్ ఇండియన్‌ స్టాండర్డ్‌ (BIS) సర్టిఫికేషన్‌ వెబ్‌సైట్‌లో కనిపించింది. అయితే పోకో సంస్థ ఈ కొత్త హ్యాండ్‌సెట్‌ గురించి ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. Gizmochina నివేదిక ప్రకారం.. పోకో M6 ప్లస్‌ 5G స్మార్ట్‌ఫోన్‌.. ప్రస్తుతం చైనాలో ఉన్న రెడ్‌మి నోట్‌ 13R కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా రానుందని సమాచారం.

ఈ పోకో M6 ప్లస్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ (Poco M6 Plus 5G) HyperOS కోడ్‌తో మోడల్‌ నంబర్‌ N19 ను కలిగి ఉంది. దీంతోపాటు బ్యూరో ఆఫ్‌ ఇండియన్ స్టాండర్డ్‌ (BIS) లిస్టింగ్‌ ప్రకారం ఈ పోకో కొత్త స్మార్ట్‌ఫోన్‌ 24065PC95I మోడల్‌ నంబర్‌తో కనిపించింది. ఈ నంబర్‌ ద్వారా భారత్‌లో విడుదల ధ్రువీకరించబడింది. అయితే వచ్చే నెలలో భారత్‌లో విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

Poco M6 Plus 5G Smartphone may expected to launch soon

పోకో M6 ప్లస్‌ 5G స్మార్ట్‌ఫోన్ బడ్జెట్ ధరలో భారత్‌ మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం చైనాలో అందుబాటులో ఉన్న రెడ్‌మి నోట్‌ 13R హ్యాండ్‌సెట్‌ 6GB ర్యామ్‌ +128GB అంతర్గత స్టోరేజీ ధర CNY 1399 (భారత్‌ కరెన్సీ ప్రకారం రూ.16000) గా ఉంది. భారత్‌లో పోకో కొత్త ఫోన్‌ ధర కూడా ఇదే రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది.

రెడ్‌మి నోట్‌ 13R స్మార్ట్‌ఫోన్‌ వివరాల ఆధారంగా పోకో M6 ప్లస్‌ 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.79 అంగుళాల పుల్‌ HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు స్నాప్‌ డ్రాగన్‌ 4 జెన్‌ 2 చిప్‌సెట్‌ పైన పనిచేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

దీంతోపాటు ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత HyperOS పైన పనిచేసే అవకాశం ఉంది. మరియు వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉండే అవకాశం ఉంది. 50MP ప్రధాన కెమెరా సహా 2MP మ్యాక్రో లెన్స్‌ తో విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది.

ఈ పోకో M6 ప్లస్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ 5030mAh బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉంది. కనెక్టివిటీ పరంగా USB-C ఛార్జింగ్‌ పోర్టు, బ్లూటూత్‌ 5.1 సహా భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్ ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌ కలిగి ఉండే అవకాశం ఉంది. అయితే ఈ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లపై పోకో సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Poco M6 Plus 5G Smartphone spotted on BIS website and expected to launch soon in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X