Home
Mobile

రూ.10499 ధరకే 108MP కెమెరా, 6.79 అంగుళాల FHD డిస్‌ప్లే, 128GB స్టోరేజీ 5G స్మార్ట్‌ఫోన్‌..!

భారత్‌ మార్కెట్‌లో ఇటీవల పోకో అనేక బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. ఇందులో X7 సిరీస్‌ మరియు M7 5G ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఈ రెండు ఫోన్‌లు ఆయా సెగ్మెంట్స్‌లో బెస్ట్‌ హ్యాండ్‌సెట్స్‌గా ఉన్నాయి. అయితే గత సంవత్సరం లాంచ్‌ అయిన పోకో M6 ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్ ఇప్పటికీ బెస్ట్‌ ఫోన్‌గా కొనసాగుతోంది. ఈ ఫోన్‌ ఎంట్రీ లెవల్‌లో ఏకంగా 108MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. మరియు డిజైన్ పరంగాను ఈ హ్యాండ్‌సెట్‌ ఆకట్టుకుంటుంది.

గత సంవత్సరం ఆగస్టులో పోకో M6 ప్లస్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. విడుదల సమయంలో 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.13499, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.14499 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ హ్యాండ్‌సెట్‌ను తక్కువ ధరకే అందుబాటులో ఉంది.

Poco M6 Plus 5G smartphone

రూ.3200 తగ్గింపు :
ఫ్లి్‌ప్‌కార్ట్‌లో 6GB ర్యామ్ వేరియంట్ ధర రూ.10499 కే కొనుగోలు చేయవచ్చు. అంటే రూ.3000 ధర తగ్గింది. అదే 8GB ర్యామ్ ధర రూ.11299 గా ఉంది. అంటే రూ.3200 తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్‌ యాక్సెస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డు ద్వారా 5 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు.

బెస్ట్‌ ఆప్షన్‌గా :
పోకో M6 ప్లస్‌ 5G స్మార్ట్‌ఫోన్ గ్రాఫైట్‌ బ్లాక్‌, ఐస్‌ సిల్వర్‌, మిస్టీ లావెండర్‌ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. రూ.10 వేల ధరలో మంచి కెమెరా, భారీ డిస్‌ప్లే, నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ అందించే ఫోన్‌ కొనుగోలు చేయాలని భావిస్తున్నవారికి ఈ హ్యాండ్‌సెట్ బెస్ట్‌ ఆప్షన్‌గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ POCO M6 Plus 5G ఫోన్‌ను కొనుగోలు చేయాలని భావిస్తున్నవారు ఈ లింక్‌ పైన క్లిక్ చేసి కొనుగోలు చేయవచ్చు.

భారీ డిస్‌ప్లే :
పోకో M6 ప్లస్‌ 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.79 అంగుళాల FHD+ (2400 x 1080 పిక్సల్స్‌) డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 550 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 240Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 3 ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
ఈ పోకో స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 4 జెన్‌ 2 AE SoC ప్రాసెసర్‌తో పనిచేస్తోంది. దీంతోపాటు Adreno A613 GPU ను కూడా కలిగి ఉంది. మరియు ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత HyperOS పైన పనిచేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 2 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని పోకో తెలిపింది.

108MP కెమెరా :
ఈ ఫోన్ కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. 108MP శాంసంగ్‌ ISOCELL HM6 ప్రైమరీ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 13MP కెమెరాను అమర్చారు. ఈ హ్యాండ్‌సెట్ 33W వైర్‌ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5030mAh బ్యాటరీతో పనిచేస్తోంది. సెక్యూరిటీ కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను అమర్చారు.

గమనిక : గిజ్‌బాట్ వెబ్‌సైట్‌లోని అఫిలియేట్ లింక్స్‌ ద్వారా చేసిన కొనుగోళ్ల నుంచి కమీషన్‌ను సంపాదిస్తుంది. ఉత్పత్తులకు సంబంధించిన అసలైన అభిప్రాయాలు, వ్యక్తిగత అనుభవం ఆధారంగా సిఫార్సు చేయబడతాయి. అది కూడా మీకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా.

More from GizBot

Best Mobiles in India

English summary
Poco M6 Plus 5G smartphone with 108MP Camera gets at rs10499 in flipkart here is the deal
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X