ధర రూ.11,999 కే 108MP కెమెరా, 128GB స్టోరేజీ 5G స్మార్ట్‌ఫోన్.. ధర, సేల్ వివరాలు..!
పోకో M6 ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్ (Poco M6 Plus 5G Smartphone) భారత్ విడుదల అయింది. ఇప్పటికే పోకో M6 5G, పోకో M6 ప్రో 5G ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లస్ మోడల్ 6.79 అంగుళాల పుల్ HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 AE చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.11,999 గా ఉంది. పోకో బడ్స్ X1 (Poco Buds X1) కూడా భారత్‌లో విడుదల అయ్యాయి. సింగిల్ ఛార్జింగ్ ద్వారా 36 గంటలపాటు వినియోగించుకోవచ్చు. ఆగస్టు 5 నుంచి ఈ రెండు ఉత్పత్తుల సేల్ ప్రారంభం కానుంది.
పోకో M6 ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
పోకో M6 ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్ 6.79 అంగుళాల పుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 2400*1080 పిక్సల్ రిజల్యూషన్, 120Hz రీఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే కార్నింగ్ గొరెల్లా గ్లాస్ 3 రక్షణ కలిగి ఉంటుంది.

ఈ పోకో కొత్త స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS ను కలిగి ఉంది. మరియు స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 AE SoC చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. గరిష్ఠంగా 8GB ర్యామ్, 128GB స్టోరేజీతో జతచేయబడుంది. అదనంగా 8GB ర్యామ్‌ను వర్చువల్‌గా పొడిగించుకోవచ్చు. రెండు ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, నాలుగు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌ల పొందవచ్చని సంస్థ తెలిపింది.
కెమెరా విభాగం పరంగా పోకో M6 ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. 3X జూమింగ్ సపోర్టుతో 108MP ప్రధాన కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియోల కోసం 13MP కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. ఈ రెండు కెమెరాలతో 30fps వద్ద 1080p మరియు 720p నాణ్యతతో వీడియోలను రికార్డు చేయవచ్చు.

ఈ పోకో కొత్త స్మార్ట్‌ఫోన్ 33W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5030mAh బ్యాటరీని కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా ఈ పోకో స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ సిమ్ కార్డులు, వైఫై, బ్లూటూత్ 5.0, 5G, 4G LTE, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో అందుబాటులోకి వచ్చింది. IP53 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
పోకో M6 ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర బ్యాంకు ఆఫర్లతో కలిపి రూ.11,999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర బ్యాంకు ఆఫర్లతో కలిపి రూ.13,499 గా ఉంది. ఆగస్టు 5 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. గ్రాఫైట్ బ్లాక్, ఐస్ సిల్వర్, మిస్టీ లావెండర్ రంగుల్లో లభిస్తుంది.

పోకో బడ్స్ X1 ఫీచర్‌లు, ధర :
పోకో M6 ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్‌తోపాటు పోకో బడ్స్ X1 కూడా భారత్‌లో విడుదల అయ్యాయి. ఈ బడ్స్ 12.4mm డైనమిక్ టైటానియం డ్రైవర్‌లను కలిగి ఉంటుంది. బ్యాగ్రౌండ్ నాయిస్ క్యాన్సిలేషన్ కోసం 40dB హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. ఈ బడ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC) ఫీచర్‌ను కలిగి ఉంటాయి.
దీంతోపాటు యాంటీ విండ్ నాయిస్ అల్గారిథమ్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఇయర్‌బడ్స్‌ను ఒకసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి 36 గంటల ప్లేటైం మరియు 7 గంటల ప్లేబ్యాక్ సమయాన్ని పొందవచ్చు. మెరుగైన ఆడియో అనుభూతి కోసం టచ్ గెశ్చర్స్‌ను కలిగి ఉంటుంది. IP54 రేటింగ్‌ను కలిగి ఉంటాయి. ఈ బడ్స్ ధర రూ.1,699 గా ఉంది.


Click it and Unblock the Notifications








