Home
Mobile

Poco నుంచి భారీ బ్యాటరీతో మరో స్మార్ట్‌ఫోన్‌.. తాజాగా కీలక స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు లీక్‌..!

Poco M6 Plus Smartphone : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ పోకో నుంచి ఇటీవల పోకో F7 5G స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ అయింది. ఏకంగా 7550mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. డిజైన్‌ పరంగానూ ఆకట్టుకుంటుంది. అయితే త్వరలో పోకో నుంచి భారత్ మార్కెట్‌లోకి మరో స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. పోకో M7 ప్లస్‌ పేరుతో ఈ హ్యాండ్‌సెట్‌ లాంచ్‌ కానుంది. తాజాగా ఇందుకు సంబంధించిన అనేక వివరాలు వెల్లడయ్యాయి.

పోకో M7 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్ భారత్‌లో త్వరలో లాంచ్‌ కానుంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్‌కు సంబంధించిన మైక్రోసైట్‌ లైవ్‌లో ఉంది. అయితే ఈ ఫోన్‌ విడుదలపై సంస్థ అధికారికంగా స్పందించాల్సి ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్‌ టీజర్‌ ద్వారా ఈ ఫోన్ టీజర్‌ వెల్లడయింది.

Poco M6 Plus smartphone

ఎప్పుడు విడుదల కానుంది? :
ఈ ఫ్లి‌ప్‌కార్ట్‌ టీజర్‌ ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్‌ భారీ బ్యాటరీతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే 91mobiles వివరాల ఆధారంగా పోకో M6 ప్లస్‌ పేరుతో లాంచ్‌ కానుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌ ఆగస్టు 13 తేదీ విడుదల అయ్యే అవకాశం ఉంది.

ఎంత ధరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది :
కొన్ని నివేదికల ఆధారంగా పోకో M7 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌... రెడ్‌మి 15 హ్యాండ్‌సెట్‌ కు రీబ్రాండెడ్‌ వెర్షన్‌గా ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు రూ.15 వేల ధర రేంజ్‌లో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. టిప్‌స్టర్‌ సంజూ చౌదరీ పోకో M6 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ గురించి అనేక వివరాలు వెల్లడించారు.

టిప్‌స్టర్‌ అందించిన వివరాల ఆధారంగా పోకో M7 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ 6.9 అంగుళాల ఫుల్‌ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. స్నాప్‌డ్రాగన్ 6s జెన్‌ 3 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలిపారు. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ 33W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది.

కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 8MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ IP64 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంటుందని తెలుస్తోంది.

పోకో F7 5G స్మార్ట్‌ఫోన్‌ :
పోకో F7 5G స్మార్ట్‌ఫోన్‌ 6.83 అంగుళాల FHD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. IP66+ IP68+ IP69 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. గూగుల్‌ జెమిని, సర్కిల్‌ టూ సెర్చ్‌, AI నోట్స్ వంటి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్లున్నాయి.

ఈ పోకో ఫోన్‌ స్నాప్‌డ్రాగన్ 8s జెన్‌ 4 SoC చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS 2.0 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ 90W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 22.5W వైర్‌ రివర్స్ ఛార్జింగ్‌ సపోర్టుతో 7550mAh సిలికాన్‌ కార్బన్‌ బ్యాటరీని కలిగి ఉంది. 50MP సోనీ IMX882 కెమెరా (OIS), 8MP అల్ట్రావైడ్‌ లెన్స్‌, 20MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Poco M6 Plus smartphone tipped to launch on august 13 in india, expected to feature 7000mAh battery
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X