రూ.10 వేల ధరకే 108MP కెమెరా, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 4 సంవత్సరాల అప్‌డేట్స్‌తో 5G స్మార్ట్‌ఫోన్..!
భారత్ మార్కెట్ లో రూ.10 వేల ధర రేంజ్‌లో అనేక స్మార్ట్‌ఫోన్ లు అందుబాటులో ఉన్నాయి. ఈ ధరలో కొన్ని మోడల్స్ కెమెరా, చిప్‌సెట్ విషయంలో రాజీపడే అవకాశం ఉంటుంది. అయితే గత సంవత్సరం విడుదలై ఇప్పటికే ఎంట్రీ లెవల్ ధరలో బెస్ట్ హ్యాండ్‌సెట్ గా ఉన్న పోకో M6 ప్లస్ స్మార్ట్‌ఫోన్ ఉంది. ఈ ఫోన్ రూ.10 వేల ధరలో 108MP కెమెరా, స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ సహా అనేక మెరుగైన ఫీచర్‌లను కలిగి ఉంది.
రూ.10 వేల రేంజ్‌లో :
ఈ పోకో M6 ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్ (Poco M6 Plus Smartphone) గత సంవత్సరం ఆగస్టులో లాంచ్ అయింది. విడుదల సమయంలో 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.13499 గా ఉండేది. మరియు 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14499 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో ఈ ఫోన్‌ను రూ.10వేల ధరకు కొనుగోలు చేయవచ్చు.

5 శాతం క్యాష్‌బ్యాక్ :
ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.10,080 గా ఉంది. అదే 8GB ర్యామ్ వేరియంట్ ధర రూ.11499 గా ఉంది. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు కార్డుల ద్వారా 5 శాతం క్యా్‌ష్‌బ్యాక్‌ను పొందవచ్చు. గ్రాఫైట్ బ్లాక్, ఐస్ సిల్వర్, మిస్టీ లావెండర్ కలర్ వేరియంట్స్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.
స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్, 4 సంవత్సరాల అప్‌డేట్స్ :
పోకో M6 ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 AE SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంది. దీంతోపాటు Adreno A613 GPU ను కూడా కలిగి ఉంది. మరియు ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS పైన పనిచేస్తోంది. 2 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని పోకో తెలిపింది.

డిస్‌ప్లే వివరాలు :
పోకో M6 ప్లస్ 5G హ్యాండ్‌సెట్ 6.79 అంగుళాల FHD+ LCD డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 550 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌ను పొందుతుంది.
108MP ప్రైమరీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ 108MP శాంసంగ్ ISOCELL HM6 ప్రైమరీ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 13MP కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ 33W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5030mAh బ్యాటరీని కలిగి ఉంది.
కనెక్టివిటీ పరంగా 5G, 4G, వైఫై, బ్లూటూత్ 5.0 ను కలిగి ఉంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. IR బ్లాస్టర్‌ను కూడా కలిగి ఉంది. మరియు IP53 రేటింగ్‌తో డస్ట్ మరియు స్ల్పాష్ రెసిస్టెంట్‌గా ఉంది.


Click it and Unblock the Notifications








