Home
Mobile

ధర రూ.9,999 కే 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ 5G స్మార్ట్‌ఫోన్‌.. ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌ పూర్తి వివరాలు..!

ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం ఎండ్ ఆఫ్‌ ది రీజన్ సేల్‌ 2024 జరుగుతోంది. ఈ సేల్‌ జూన్‌ 1వ తేదీన ప్రారంభం అయింది. జూన్‌ 12వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో పోకో M6 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ను ( Poco M6 Pro 5G Smartphone) 41 శాతం తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ డిజైన్ ఆకట్టుకొనే విధంగా ఉంటుంది. మరియు 5000mAh బ్యాటరీ సహా 50MP కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్‌ బ్యాంకు కార్డు ద్వారా 5 శాతం వరకు అదనపు తగ్గింపును పొందవచ్చు.

పోకో M6 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 6GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ పవర్‌ బ్లాక్‌ కలర్‌ వేరియంట్‌ను విడుదల సమయంలో పోలిస్తే 41 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.9999 కే సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ఈ ఆఫర్‌ను పొందవచ్చు. అయితే వివిధ కలర్‌ వేరియంట్‌లపై ధరల్లో కొన్ని మార్పులు ఉన్నాయి.

Poco M6 Pro 5G smartphone received massive discount on flipkart

పోకో M6 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
పోకో M6 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 6.79 అంగుళాల పుల్‌ HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 90Hz రీప్రెష్‌ రేట్‌, 550 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్‌ రక్షణను పొందుతుంది. ఈ ఫోన్‌ ఫారెస్ట్ గ్రీన్, పవర్ బ్లాక్‌ రంగుల్లో లభిస్తుంది.

ఈ పోకో హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత MIUI 14 పైన పనిచేస్తుంది. మరియు క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 4 జెన్‌ 2 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంది. మరియు Adreno 613 GPU తో జతచేయబడి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ గరిష్ఠంగా 6GB ర్యామ్ మరియు 128GB అంతర్గత స్టోరేజీని కలిగి ఉంది. SD కార్డు ద్వారా స్టోరేజీని పొడిగించుకోవచ్చు.

కెమెరా విభాగం పరంగా ఈ పోకో హ్యాండ్‌సెట్ 50MP కెమెరా, 2MP డెప్త్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. దీంతోపాటు LED ఫ్లాష్‌ లైట్‌ కూడా ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 18W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఈ పోకో M6 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ IP53 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ను కలిగి ఉంటుంది. భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. మరియు కనెక్టివిటీ పరంగా 5G, బ్లూటూత్ 5.1, వైఫై 6, GPS, USB-C ఛార్జింగ్ పోర్టులను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 199 గ్రాముల బరువు ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Poco M6 Pro 5G smartphone Attracts with huge discount on flipkart 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X