Home
Mobile

రూ.10,000 ధరలో అద్భుతమైన డిజైన్‌, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో 5G స్మార్ట్‌ఫోన్‌.. పూర్తి వివరాలు..!

పోకో నుంచి భారత్‌ మార్కెట్‌ లోకి డిసెంబర్‌ నెలలో పోకో C75 5G, పోకో M7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ లు లాంచ్‌ అయ్యాయి. అలాగే జనవరి నెలలో పోకో X7 సిరీస్‌ విడుదల అయింది. త్వరలో పోకో నుంచి మరో హ్యాండ్‌సెట్‌ లాంచ్‌ కానుంది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియా ద్వారా పోకో కీలక ప్రకటన చేసింది. పోకో M6 5G స్మార్ట్‌ఫోన్‌ కు తర్వాత తరం వెర్షన్‌ గా పోకో M7 5G స్మార్ట్‌ఫోన్‌ ను (Poco M7 5G Smartphone Launch Date) అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది.

పోకో M7 5G స్మార్ట్‌ఫోన్ విడుదల తేదీ :
పోకో తన X ప్లాట్‌ఫాం ద్వారా పోకో M7 5G విడుదల తేదీని ప్రకటన చేసింది. మార్చి 3 వ తేదీ మధ్యా్హ్నం 12 గంటలకు లాంచ్‌ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఫోన్‌ డిజైన్‌ ను కూడా విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్‌ ఫ్లి్ప్‌కార్ట్‌ ద్వారా భారత్‌ మార్కెట్‌ లో సేల్‌ ప్రారంభం కానుంది.

Poco M7 5G Smartphone confirmed to launch on march 3 in india

స్నాప్‌డ్రాగన్‌ చిప్‌సెట్ :
పోకో M7 5G స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 4 జెన్‌ 2 చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 12GB ర్యామ్ (6GB టర్బో ర్యామ్) తో జతచేసి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు ఇప్పటికీ అందుబాటులోకి వచ్చిన వివరాలు ఆధారంగా HyperOS తో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది.

కెమెరా మాడ్యూల్‌ :
పోకో పోస్ట్‌ ఆధారంగా M7 5G హ్యాండ్‌సెట్‌ వృత్తాకార కెమెరా మాడ్యూల్‌ ను కలిగి ఉంది. దీంతోపాటు ఈ సెగ్మెంట్‌లోనే ఫాస్టెస్ట్‌ ఫోన్‌ ఇదేనని పోకో చెబుతోంది. ఈ పోకో కొత్త ఫోన్‌ రూ.10,000 కంటే తక్కువ ధరకు అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఇప్పటికే అందుబాటులో ఉన్న ప్రో మోడల్‌ :
గత సంవత్సరం డిసెంబల్‌లో పోకో M7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో విడుదల అయింది. 6.67 అంగుళాల FHD+ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్‌ 5 రక్షణ ను పొందుతుంది. ఆం‌డ్రాయిడ్‌ 14 ఆధారిత HyperOS ను కలిగి ఉంది. మరియు మీడియాటెక్‌ డైమెన్సిటీ 7025 అల్ట్రా చిప్‌సెట్‌ తో పనిచేస్తోంది.

కెమెరాల పరంగా 50MP సోనీ LYT 600 ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. మరియు 20MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. అదే బ్యాటరీ, మరియు ఛార్జింగ్ పరంగానూ మెరుగైన స్పెసిఫికేషన్లను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 45W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5110mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది.

పోకో M7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.13999 గా ఉంది. మరో వేరియంట్ ధర రూ.15999 గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Poco M7 5G Smartphone confirmed to launch on march 3 in india with snapdragon chipset
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X