Home
Mobile

రూ.10,000 కంటే తక్కువ ధరకే 6.88 అంగుళాల భారీ డిస్‌ప్లే. 50MP సోనీ కెమెరా, 5160mAh బ్యాటరీ 5G ఫోన్‌..!

పోకో నుంచి మరో రెండు రోజుల్లో బడ్జెట్‌ రేంజ్‌లో స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. ఇటీవలే ఈ పోకో M7 5G ఫోన్‌ లాంచ్‌పై సంస్థ ప్రకటన చేసింది. మార్చి 3 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్‌ లాంచ్ కానుంది. ఫ్లి్ప్‌కార్ట్‌ ద్వారా ఈ ఫోన్‌ అందుబాటులోకి రానుంది. రూ.10,000 ధరలో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. అయితే తాజాగా ఈ హ్యాండ్‌సెట్ కీలక స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలను వెల్లడించింది.

పోకో M7 5G స్మార్ట్‌ఫోన్ (Poco M7 5G Smartphone) గత సంవత్సరం విడుదల అయిన పోకో M6 5G ఫోన్‌కు తర్వాత తరం వెర్షన్‌గా లాంచ్ కానుందని తెలుస్తోంది. అయితే తాజాగా డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ, ఛార్జింగ్‌ సహా మరిన్ని వివరాలు వెల్లడించింది. ఈ ఫోన్ మింట్ గ్రీన్‌, ఓసియన్‌ బ్లూ మరియు స్టాటిన్ బ్లాక్‌ రంగుల్లో లభిస్తుందని సంస్థ తెలిపింది.

Poco M7 5G Smartphone telugu news

పోకో M7 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
తాజాగా అందుబాటులోకి వచ్చిన వివరాల ఆధారంగా పోకో కొత్త హ్యాండ్‌సెట్ 6.88 అంగుళాల భారీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 240Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌, 600 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది.

ఈ డిస్‌ప్లే TUV లో లైట్‌, TUV ఫ్లి్క్కర్‌ ఫ్రీ, TUV సర్కాడియన్‌తో కూడిన TUV Rheinland సర్టిఫికేషన్‌ను కలిగి ఉంటుంది. ఎంట్రీ లెవల్ ధరలో 5G ఫోన్ కోసం చూసేవారికి ఈ భారీ డిస్‌ప్లే ఫోన్‌ అనుకూలంగా ఉంటుంది. పోకో M7 5G స్మార్ట్‌ఫోన్‌ ఇప్పటికే స్నాప్‌డ్రాగన్‌ 4 జెన్‌ 2 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుందని ఇప్పటికే పోకో వెల్లడించింది.

Poco M7 5G Smartphone telugu news

కెమెరా విభాగం వివరాలను కూడా పోకో వెల్లడించింది. M7 5G ఫోన్ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP సోనీ IMX852 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. మరియు LED ఫ్లాష్‌ లైట్‌ కూడా అమర్చి ఉంటుంది. మరో కెమెరా వివరాలు తెలియాల్సి ఉంది.

సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాతో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ ముందు, వెనుక కెమెరాలు 30fps వద్ద 1080 పిక్సల్ రిజల్యూషన్‌తో రికార్డు చేసేందుకు అనుకూలంగా ఉంటాయి. ఈ ధరలో మెరుగైన కెమెరాలు గానే భావించవచ్చు.

ఈ పోకో ఫోన్ బ్యాటరీ వివరాలు కూడా వెల్లడయ్యాయి. 18W వైర్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5160mAh బ్యాటరీతో అందుబాటులోకి రానుంది. దీంతోపాటు కొనుగోలు సమయంలో ఛార్జర్‌ను ఉచితంగా అందిస్తామని సంస్థ వెల్లడించింది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేసి 12 గంటలపాటు వీడియో స్ట్రీమింగ్‌ కోసం వినియోగించుకోవచ్చని సంస్థ తెలిపింది.

సింగిల్‌ ఛార్జింగ్‌తో 56 గంటల వరకు వాయిస్‌ కాలింగ్‌ సామర్థ్యం ఈ ఫోన్‌ సొంతమని ఫోకో వెల్లడించింది. IP52 రేటింగ్‌తో డస్ట్‌ మరియు స్ల్పాష్‌ రెసిస్టెంట్‌గా లాంచ్ కానుంది. ఈ హ్యాండ్‌సెట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్‌ ప్రారంభం కానుంది. మరియు రూ.10000 కంటే తక్కువ ధరలోనే అందుబాటులోకి రానుందని తెలిపింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Poco M7 5G Smartphone display camera battery specs confirmed ahead of launch on march 3 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X