Home
Mobile

రూ.9499 కే 6.88 అంగుళాల భారీ డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరా 5G స్మార్ట్‌ఫోన్‌...!

Poco M7 5G Smartphone : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ ల తయారీ సంస్థ పోకో ఈ సంవత్సరం తొలి భాగంలో ఎంట్రీ ధరలో పోకో M7 5G స్మార్ట్‌ఫోన్‌ ను లాంచ్‌ చేసింది. అయితే రూ.10 వేల ధర రేంజ్‌ లో అందుబాటులోకి వచ్చినా.. భారీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్‌ చిప్‌సెట్ తో పనిచేస్తుంది. మరియు 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందవచ్చు. అయితే ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. పోకో M7 5G స్మార్ట్‌ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల పూర్తి వివరాలు.

రూ.9499 ధరకే స్మార్ట్‌ఫోన్ :
పోకో M7 5G స్మార్ట్‌ఫోన్ విడుదల సమయంలో 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.10499, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.11499 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ లో (Flipkart) 6GB వేరియంట్‌ ను రూ.9499, 8GB వేరియంట్‌ ను రూ.10499 కే కొనుగోలు చేయవచ్చు.

Poco M7 5G smartphone flipkart deal

మూడు కలర్ వేరియంట్స్‌ :
దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్‌ యాక్సెస్‌ క్రెడిట్‌ కార్డు, ఫ్లిప్‌కార్ట్‌ SBI క్రెడిట్‌ కార్డులపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ ను పొందవచ్చు. పోకో M7 5G హ్యాండ్‌సెట్ మింట్‌ గ్రీన్‌, శాటిన్‌ బ్లాక్‌, ఓసియన్‌ బ్లూ కలర్‌ వేరియంట్స్‌ లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.

6.88 అంగుళాల భారీ డిస్‌ప్లే :
పోకో M7 5G స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.88 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 600 నిట్స్‌ గరిష్ట బ్రైట్‌నెస్‌, 240Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే TUV సర్టిఫికేషన్‌ లను కలిగి ఉంది.

స్నాప్‌డ్రాగన్‌ చిప్‌సెట్‌, 4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్‌ 2 ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతుంది.

50MP సోనీ కెమెరా, ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టు :
ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5160mAh బ్యాటరీతో పనిచేస్తోంది. కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంది. 50MP సోనీ IMX852 ప్రైమరీ కెమెరా, సెకండరీ కెమెరాలు, ఫ్లాష్‌ లైట్‌ ఉంది. ముందు వైపు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

Poco M7 5G smartphone flipkart deal

IP52 రేటింగ్‌ తో :
కనెక్టివిటీ పరంగా పోకో హ్యాండ్‌సెట్ 5G, 4G LTE, బ్లూటూత్‌, Wi-Fi, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం ఈ హ్యాండ్‌సెట్‌ సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ IP52 రేటింగ్‌ తో డస్ట్‌ మరియు స్ల్పాష్‌ రెసిస్టెంట్‌ గా ఉంది.

Best Mobiles in India

English summary
Poco M7 5G smartphone with 6.88 inch large display available at rs9499 on flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X