Home
Mobile

రూ.15 వేల ధరకే 7000mAh భారీ బ్యాటరీ, 6.9 అంగుళాల భారీ డిస్‌ప్లే 5G స్మార్ట్‌ఫోన్‌..!

Poco M7 Plus 5G Smartphone : పోకో నుంచి భారత్‌ మార్కెట్‌ లోకి పోకో M7 ప్లస్‌ 5G స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 13 వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే ఈ సిరీస్‌ లో పోకో M7, పోకో M7 ప్రో ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే త్వరలో విడుదల కానున్న ఫోన్‌ భారీ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు ఈ ఫోన్‌ 7000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అయితే తాజాగా ఈ ఫోన్‌ కు సంబంధించిన అనేక వివరాలు వెల్లడయ్యాయి.

పోకో M7 ప్లస్‌ 5G ఫోన్‌ ఎప్పుడు విడుదల కానుంది ? :
ఈ పోకో M7 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ త్వరలో భారత్‌ మార్కెట్‌లో లాంచ్ కానున్న రెడ్‌మి 15 5G మోడల్‌ కు రీబ్రాండెడ్‌ వెర్షన్‌గా విడుదల కానుందని తెలుస్తోంది. ఈ పోకో స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 13 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదలక కానుంది.

Poco m7 plus 5G phone

ఎంత ధరలో అందుబాటులోకి రానుంది ? :
విడుదల అనంతరం ఈ హ్యాండ్‌సెట్‌ ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) ద్వారా అందుబాటులోకి రానుంది. మరియు పోకో M7 ప్లస్‌ 5G స్మార్ట్‌ఫోన్ రూ.15 వేల కంటే తక్కువ ధరలో అందుబాటులోకి రానుందని సంస్థ వెల్లడించింది. తాజాగా ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌ లు, ఫీచర్ల వివరాలు లీక్‌ అయ్యాయి.

7000mAh భారీ బ్యాటరీ :
ఇప్పటికే విడుదల అయిన వివరాల ఆధారంగా పోకో M7 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ 7000mAh సిలికాన్‌ కార్బన్‌ బ్యాటరీతో విడుదల కానుంది. ఈ ఫోన్‌ రివర్స్‌ ఛార్జింగ్ సపోర్టును కూడా కలిగి ఉంటుంది. అయితే భారీ బ్యాటరీతో అందుబాటులోకి వస్తున్న స్లిమ్ డిజైన్‌ ను కలిగి ఉంటుందని సంస్థ తెలిపింది.

Poco m7 plus 5G phone

144 గంటల ఆఫ్‌లైన్‌ మ్యూజిక్‌ ప్లేబ్యాక్‌ టైం ! :
ఈ బ్యాటరీని ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేసి 12 గంటల వరకు నేవిగేషన్‌ కోసం వినియోగించుకోవచ్చు. లేదా 24 గంటల వీడియో ప్లేబ్యాక్‌ లేదా 27 గంటల సోషల్‌ మీడియా వినియోగం లేదా 144 గంటల ఆఫ్‌లైన్‌ మ్యూజిక్‌ ప్లే్బ్యాక్ కోసం ఉపయోగించుకోవచ్చని సంస్థ చెబుతోంది.

భారీ డిస్‌ప్లే :
ఈ పోకో హ్యాండ్‌సెట్ 144Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.9 అంగుళాల FHD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 6s జెన్‌ 3 చిప్‌సెట్‌ ను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS తో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

కెమెరా విభాగం పరంగా పోకో M7 ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరాతోపాటు మరో కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది

More from GizBot

Best Mobiles in India

English summary
Poco m7 plus 5G smartphone key specifications features confirmed ahead of launch on august 13 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X