రూ.13499 ధరకే 7000mAh భారీ బ్యాటరీ, 6.9 అంగుళాల భారీ డిస్‌ప్లే 5G స్మార్ట్‌ఫోన్..!
Poco M7 Plus 5G Smartphone : భారత్ మార్కెట్ లో బడ్జెట్ ధరలో భారీ బ్యాటరీ, భారీ డిస్‌ప్లేతో పోకో ఓ స్మార్ట్‌ఫోన్ ను తీసుకొచ్చింది. పోకో M7 ప్లస్ 5G పేరుతో అందుబాటులోకి వచ్చింది. గత నెలలో సేల్ కూడా ప్రారంభం అయింది. అయితే ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. బడ్జెట్ ధరలో ఫోన్ కోసం చూస్తున్నట్లయితే ఈ ఫోన్‌ను పరిశీలించవచ్చు.
ధర వివరాలు :
ఆగస్టు నెలలో ఫోన్ సేల్ ప్రారంభం అయ్యే సమయంలో పోకో M7 ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్ ధర 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.13999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.14999 గా ఉండేది. అయితే ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్‌ను ఫ్లిప్‌కార్ట్ లో డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.

డిస్కౌంట్ ఆఫర్ :
ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ను రూ.500 డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఫలితంగా ఈ ఫోన్‌ల ప్రస్తుత ధర రూ.13,499, రూ.14,499 గా ఉంది. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై 5 శాతం వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ క్రోమ్ సిల్వర్, కార్బన్ బ్లాక్, ఆక్వా బ్లూ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.
చిప్‌సెట్, OS వివరాలు :
పోకో M7 ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 3 చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ 8GB LPDDR4x ర్యామ్, 128GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంది. ఈ ఫోన్ వర్చువల్ ర్యామ్ ఫీచర్ కూడా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS 2.0 పైన పనిచేస్తోంది.
6.9 అంగుళాల భారీ డిస్‌ప్లే :
ఈ పోకో హ్యాండ్‌సెట్ బడ్జెట్ ధరలో భారీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.9 అంగుళాల FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 144Hz రీఫ్రెష్ రేట్, 850 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే TUV Rheinland సర్టిఫికేషన్‌తో అందుబాటులో ఉంది.

7000mAh భారీ బ్యాటరీ :
పోకో M7 ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్ భారీ బ్యాటరీని కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 33W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్, 18W రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, మరో కెమెరా మరియు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను కలిగి ఉంది.
ఈ పోకో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెండు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని పోకో సంస్థ హామీ ఇస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ IP64 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్ 5.1, WiFi, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను అమర్చారు.


Click it and Unblock the Notifications