Home
Mobile

తక్కువ ధరలో భారీ బ్యాటరీ, భారీ డిస్‌ప్లే 5G స్మార్ట్‌ఫోన్‌ కోసం చూస్తున్నారా.. సేల్‌ ఎప్పుడంటే?

Poco M7 Plus 5G smartphone Sale Date : పోకో నుంచి భారత్‌ మార్కెట్లోకి పోకో M7 5G స్మార్ట్‌ఫోన్‌ ఇటీవల విడుదల అయింది. ఈ ఫోన్ భారీ డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు ఈ ఫోన్ రివర్స్‌ ఛార్జింగ్‌ను కూడా సపోర్టు చేస్తుంది. ఈ పోకో M7 ప్లస్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ రెండు స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌ సేల్‌ ఆగస్టు 19వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది.

పోకో M7 ప్లస్‌ 5G స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.13999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.14999 గా ఉంది. HDFC, ICICI, SBI బ్యాంకుల కార్డులపై రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Poco M7 Plus 5G smartphone price

పోకో M7 ప్లస్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
ఈ పోకో స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్‌ 6s జెన్‌ 3 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 8GB LPDDR4x ర్యామ్, 128GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. వర్చువల్‌ ర్యామ్‌ ఫీచర్‌ తో 16GB వరకు ర్యామ్‌ను పొడిగించుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత HyperOS 2.0 పైన పనిచేస్తుంది.

50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా పోకో స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమకీ కెమెరాతోపాటు మరో కెమెరాను అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను అమర్చారు. ఈ కెమెరాల ద్వారా 30fps వద్ద 1080 పిక్సల్‌ రిజల్యూషన్‌తో వీడియో రికార్డు చేయవచ్చు.

Poco M7 Plus 5G smartphone price

భారీ బ్యాటరీ :
ఈ స్మార్ట్‌ఫోన్ 6.9 అంగుళాల ఫుల్‌ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 144Hz రీఫ్రెష్‌ రేట్‌, 850 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 288Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే Low బ్లూ లైట్‌, ఫ్లిక్కర్ ఫ్రీ, సర్కాడియన్‌ స్టాండర్డ్‌తో TUV Rheinland సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది.

7000mAh భారీ బ్యాటరీ :
ఈ పోకో M7 ప్లస్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ 33W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 18W రివర్స్‌ ఛార్జింగ్‌ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. USB-C ఛార్జింగ్ పోర్టుతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ రెండు సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

కనెక్టివిటీ పరంగా 5G, 4G, వైఫై, బ్లూటూత్ 5.1, GPS వంటి ఫీచర్లున్నాయి. IP64 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. సెక్యూరిటీ కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ ఆక్వా బ్లూ, కార్బన్‌ బ్లాక్, క్రోమ్‌ సిల్వర్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Poco M7 Plus 5G smartphone sale to start from august 19 via Flipkart here are the features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X