రూ.15 వేల ధరలోనే 6.9 అంగుళాల భారీ డిస్‌ప్లే, 7000mAh భారీ బ్యాటరీ 5G స్మార్ట్‌ఫోన్.. ఇవాళే విడుదల..!
Poco M7 Plus 5G Smartphone Launch : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ పోకో నుంచి ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు పోకో M7 ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్ గురించి అనేక వివరాలు వెల్లడయ్యాయి. విడుదల అనంతరం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ద్వారా అందుబాటులోకి రానుంది. ఫ్లి్ప్‌కార్ట్ మైక్రోసైట్ ద్వారా ఈ పోకో ఫోన్ కు సంబంధించిన అనేక వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఫోన్ భారీ డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో అందుబాటులోకి రానుంది.
రూ.15 వేల ధరలోనే :
పోకో M7 సిరీస్ లో ఇప్పటికే M7 5G, M7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ లు అందుబాటులో ఉన్నాయి. ఈ సిరీస్ లో మూడో మోడల్ గా పోకో M7 ప్లస్ 5G ఫోన్ ఇవాళ విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్ రూ.15 వేల ధర సెగ్మెంట్ లో అందుబాటులోకి రానుందని పోకో తెలిపింది.

భారీ బ్యాటరీ :
ఫ్లిప్‌కార్ట్ వివరాల ఆధారంగా పోకో M7 ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్ 6.9 అంగుళాల భారీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 144Hz రీఫ్రెష్ రేట్ ను కలిగి ఉంటుంది. బడ్జెట్ ధరలో ఈ రెండు ఫీచర్లు బెస్ట్ గా భావించవచ్చు. ఈ డిస్‌ప్లే Low బ్లూ లైట్, ఫ్లిక్కర్ ఫ్రీ, సర్కాడియన్ TUV సర్టిఫికేషన్ లను కలిగి ఉంటుంది.
స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్, 16GB వర్చువల్ ర్యామ్ :
ఈ భారీ డిస్‌ప్లే పోకో స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 3 చిప్‌సెట్ తో పనిచేస్తుంది. స్ట్రీమింగ్, మల్టీ టాస్కింగ్ సహా ఇతర సందర్భాల్లో మెరుగైన పనితీరును అందిస్తుందని పోకో చెబుతోంది. మొత్తంగా 16GB వరకు ర్యామ్ ను పొడిగించుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్ ద్వారా సాధ్యం కానుందని తెలిపింది.

భారీ బ్యాటరీ :
ఈ పోకో M7 ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్ 2 సంవత్సరాల వరకు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ను అందిస్తుంది. ఈ ఫోన్ 7000mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. అయితే బడ్జెట్ ధరలో అందుబాటులోకి వస్తున్నా.. రివర్స్ ఛార్జింగ్ ను కూడా సపోర్టు చేస్తుందని పోకో చెబుతోంది.
ఈ బ్యాటరీని ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి 12 గంటల వరకు నేవిగేషన్ కోసం ఉపయోగించుకోవచ్చని పోకో చెబుతోంది. లేదా 24 గంటల వీడియో ప్లేబ్యాక్ లేదా 27 గంటల సోషల్ మీడియా లేదా 144 గంటల ఆఫ్‌లైన్ మ్యూజిక్ ప్లే్బ్యాక్ కోసం వినియోగించుకోవచ్చని చెబుతోంది.
రెండు కెమెరాలు :
అయితే భారీ బ్యాటరీతో అందుబాటులోకి వస్తున్నా స్లిమ్ డిజైన్ ను కలిగి ఉంటుందని పోకో తెలిపింది. కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో 50MP కెమెరాతోపాటు మరో కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








