7000mAh భారీ బ్యాటరీ, 6.9 అంగుళాల భారీ డిస్‌ప్లే 5G స్మార్ట్‌ఫోన్ డిస్కౌంట్.. ప్రారంభ ధర రూ.12999!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ పోకో గత నెలలో పోకో M7 ప్లస్ స్మార్ట్‌ఫోన్ ను (Poco M7 Plus 5G Smartphone) విడుదల చేసింది. ఈ ఫోన్ బడ్జెట్ ధరలో అందుబాటులోకి వచ్చినా భారీ డిస్‌ప్లే, భారీ బ్యాటరీని కలిగి ఉంది. మరియు రివర్స్ ఛార్జింగ్ సపోర్టును కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ గత నెలలోనే అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది.
ఈ ఫోన్ ధర వివరాలు :
పోకో M7 ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్ ఇటీవల 4GB వేరియంట్ ను కూడా విడుదల చేసింది. దీంతో మొత్తంగా మూడు స్టోరేజీ వేరియంట్స్‌లో లభిస్తుంది. 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.12,999 గా ఉంది. విడుదల సమయంలో 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.13,999 గా ఉంది.

డిస్కౌంట్ ఆఫర్ :
ఈ ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.14,999 గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో 6GB ర్యామ్ వేరియంట్ ధర రూ.13,499, 8GB ర్యామ్ వేరియంట్ ధర రూ.14,499 గా ఉంది. అంటే రూ.500 డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా మరింత తగ్గింపు ధరకు సొంతం చేసుకోవచ్చు.
భారీ డిస్‌ప్లే, కలర్ వేరియంట్స్ :
పోకో M7 ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్ 144Hz రీఫ్రెష్ రేట్‌తో 6.9 అంగుళాల ఫుల్ HD+ భారీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 850 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే TUV Rheinland సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. ఆక్వా బ్లూ, కార్బన్ బ్లాక్, క్రోమ్ సిల్వర్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 3 ప్రాసెసర్ తో పనిచేస్తోంది. ఈ ప్రాసెసర్ 8GB LPDDR4x ర్యామ్, 128GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS 2.0 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుంది.

రివర్స్ ఛార్జింగ్, 7000mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను అమర్చి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, మరో కెమెరాను కలిగి ఉంది. మరియు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 33W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్, 18W రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh భారీ బ్యాటరీతో పనిచేస్తోంది.
కనెక్టివిటీ పరంగా 5G, 4G, WiFi, బ్లూటూత్ 5.1, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. IP64 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications







