Home
Mobile

తక్కువ ధరలో భారీ డిస్‌ప్లే, భారీ బ్యాటరీ 5G ఫోన్‌ చూస్తున్నారా.. అయితే వారం రోజులు వెయిట్‌ చేయండి..!

Poco M7 Plus 5G Smartphone : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ పోకో నుంచి భారత్ మార్కెట్‌లో మరో హ్యాండ్‌సెట్‌ విడుదల కానుంది. పోకో M7 ప్లస్ 5G పేరుతో లాంచ్‌ కానుంది. ఇప్పటికే ఈ పోకో M7 5G, M7 ప్రో 5G ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ఫోన్‌ భారీ బ్యాటరీతో లాంచ్‌ కానుందని తెలుస్తోంది. పోకో M7 ప్లస్ 5G ఫోన్ లాంచ్ తేదీ సహా అనేక వివరాలు వెల్లడయ్యాయి.

ఎప్పుడు విడుదల కానుంది :
పోకో M7 ప్లస్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ మార్కెట్‌లో ఆగస్టు 13 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్‌ కానుందని తెలిపింది. ఈ ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్‌ రూ.15 వేల ధర రేంజ్‌లో అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.

Poco M7 Plus 5G smartphone design

భారీ బ్యాటరీ :
పోకో M7 ప్లస్‌ 5G స్మార్ట్‌ఫోన్ భారీ డిస్‌ప్లేతోపాటు పనితీరు పరంగానూ ఆకట్టుకుంటుందని తెలుస్తోంది. పోకో వెల్లడించిన వివరాల ఆధారంగా అప్‌కమింగ్‌ హ్యాండ్‌సెట్ సిలికాన్‌ కార్బన్‌ బ్యాటరీ టెక్నాలజీతో కూడిన 7000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి 12 గంటల పాటు నేవిగేషన్‌ లేదా 24 గంటల వీడియో ప్లేబ్యాక్‌ లేదా 27 గంటల సోషల్ మీడియా స్క్రోలింగ్‌ లేదా 144 గంటల ఆఫ్‌లైన్‌ మ్యూజిక్‌ ప్లేబ్యాక్‌ సమయాన్ని పొందవచ్చని సంస్థ చెబుతోంది. దీంతోపాటు ఈ ఫోన్‌ భారీ బ్యాటరీని కలిగి ఉంటున్నా.. సన్నని డిజైన్‌తో అందుబాటులోకి రానుంది.

Poco M7 Plus 5G smartphone design

6.9 అంగుళాల భారీ బ్యాటరీ! :
ఈ హ్యాండ్‌సెట్ రివర్స్‌ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా కలిగి ఉంటుందని పోకో వెల్లడించింది. గతంలో వచ్చిన వివరాల ఆధారంగా ఈ ఫోన్ 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.9 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. డిస్‌ప్లే ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

చిప్‌సెట్‌ వివరాలు :
ఈ పోకో M7 ప్లస్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 6s జెన్‌ 3 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. అదే విధంగా వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా మరియు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

Poco M7 Plus 5G smartphone design

పోకో M7 5G స్మార్ట్‌ఫోన్‌ :
ప్రస్తుతం భారత్‌ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న పోకో M7 5G స్మార్ట్‌ఫోన్‌ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.9299, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.10299 గా ఉంది. ఈ ఫోన్‌ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5160mAh బ్యాటరీపైన పనిచేస్తోంది.

ఈ ఫోన్‌ 6.88 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 600 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 240Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్‌ 2 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌ మింట్‌ గ్రీన్‌, ఓసియన్‌ బ్లూ, శాటిన్‌ బ్లాక్‌ కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, మరో కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు

More from GizBot

Best Mobiles in India

English summary
Poco M7 Plus 5G smartphone with 7000mAh battery confirmed to launch on august 13 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X