Home
Mobile

రూ.13999 ధరకే 7000mAh బ్యాటరీ. 6.9 అంగుళాల డిస్‌ప్లే 5G ఫోన్‌.. ఇవాళ్టి నుంచే సేల్‌..!

Poco M7 Plus 5G Sale : పోకో సంస్థ గత వారం పోకో M7 ప్లస్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఈ ఫోన్‌ భారీ డిస్‌ప్లే, భారీ బ్యాటరీని కలిగి ఉంది. అయితే బడ్జెట్‌ ధరలోనే అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ సేల్‌ ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. రూ.15 వేల ధర రేంజ్‌లో 5G స్మార్ట్‌ఫోన్‌ కోసం చూసే వారికి ఈ హ్యాండ్‌సెట్‌ ఆకట్టుకొనే అవకాశం ఉంది.

ప్రారంభ ధర రూ.13999 :
పోకో M7 ప్లస్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.13999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.14999 గా ఉంది. ఈ పోకో హ్యాండ్‌సెట్‌ కార్బన్‌ బ్లాక్, క్రోమ్‌ సిల్వర్‌, ఆక్వా బ్లూ వేరియంట్స్‌లో లభిస్తుంది.

Poco M7 Plus 5G smartphone

రూ.1000 డిస్కౌంట్‌ :
ఈ స్మార్ట్‌ఫోన్‌ను SBI, HDFC, ICICI బ్యాంకుల కార్డులపై కొనుగోలు చేస్తే.. రూ.1000 డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ ధరలో భారీ బ్యాటరీ, భారీ డిస్‌ప్లే కలిగిన ఫోన్‌ల కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నవారికి ఈ ఫోన్ మంచి ఆప్షన్‌ అయ్యే అవకాశం ఉంది.

భారీ డిస్‌ప్లే :
పోకో M7 ప్లస్‌ 5G స్మార్ట్‌ఫోన్ 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.9 అంగుళాల FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 850 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 288Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే TUV Rheinland సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. IP64 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.

ఈ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 6s జెన్‌ 3 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్‌ 8GB LPDDR4x ర్యామ్, 128GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. వర్చువల్‌ ర్యామ్‌ ఫీచర్‌ ద్వారా గరిష్ఠంగా 16GB వరకు ర్యామ్‌ను పొడిగించుకోవచ్చని పోకో చెబుతోంది.

Poco M7 Plus 5G smartphone

4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత HyperOS 2.0 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్‌ రెండు సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. రెండు స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చింది.

50MP కెమెరా, 7000mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమకీ కెమెరా, మరో కెమెరాను కలిగి ఉంది. మరియు 8MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఈ ఫోన్ 33W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. 18W రివర్స్‌ ఛార్జింగ్‌ సపోర్టును కూడా కలిగి ఉంది.

కనెక్టివిటీ పరంగా 5G, 4G, వైఫై, బ్లూటూత్ 5.1, GPS, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను అమర్చారు. బడ్జెట్ ధరలో ఎంటర్‌టైన్‌మెంట్‌ లేదా రోజువారీ టాస్క్‌ల కోసం ఈ ఫోన్‌ సౌకర్యవంతంగా ఉండే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Poco M7 Plus 5G smartphone with 7000mAh Battery sale to start from today via flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X