ధర రూ.14999 కే 50MP కెమెరా, 5110mAh బ్యాటరీ, 128GB స్టోరేజీ 5G స్మార్ట్‌ఫోన్.. ఫీచర్‌లు, సేల్ వివరాలు
పోకో నుంచి ఇవాళ భారత్ మార్కెట్ లో రెండు స్మార్ట్‌ఫోన్ లు లాంచ్ అయ్యాయి. పోకో M7 ప్రో 5G మరియు పోకో C75 5G పేరుతో అందుబాటులోకి వచ్చాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఆకట్టుకొనే డిజైన్‌తో విడుదల అయ్యాయి. పోకో M7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ (Poco M7 Pro 5G Smartphone Launched) బడ్జెట్ రేంజ్ ధరకు అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 50MP ప్రైమరీ కెమెరా, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ (Flipkart) నిర్వహించనున్నారు. ఈ హ్యాండ్‌సెట్ స్పెసిఫికేషన్ లు, ఫీచర్ లు, ధర, సేల్ వివరాలు.
పోకో M7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
ఈ హ్యాండ్‌సెట్ (Poco M7 pro 5G Smartphone Specifications) 6.67 అంగుళాల FHD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్, 1080*2400 పిక్సల్స్ రిజల్యూషన్, 2100 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరెల్లా గ్లాస్ 5 రక్షణను కలిగి ఉంది.

ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజీ జతచేసి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ మరియు 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది.

50MP + 20MP సెల్ఫీ కెమెరా :
ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. 1/1.95 అంగుళాల 50MP సోనీ LYT-600 కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ మరియు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 20MP కెమెరాను అమర్చారు. డాల్బీ అట్మాస్ సపోర్టుతో స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది.
ఈ ఫోన్ 45W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5110mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G VoLTE, బ్లూటూత్ 5.3, వైఫై, GPS, GLONASS, 3.5mm ఆడియో జాక్, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.
పోకో M7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
పోకో M7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,999 గా ఉంది. 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.16,999 ధరకు కొనుగోలు చేయవచ్చు. లావెండర్ ప్రోస్ట్, లూనార్ డస్ట్ మరియు ఓలివ్ ట్విలైట్ రంగుల్లో లభిస్తుంది.
ఈ హ్యాండ్‌సెట్ సేల్ డిసెంబర్ 20 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ప్రారంభ ఆఫర్ లో భాగంగా SBI కార్డు, HDFC బ్యాంకు, ICICI బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేసి గరిష్ఠంగా రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.


Click it and Unblock the Notifications








