Home
Mobile

50MP సోనీ కెమెరా, 5110mAh బ్యాటరీ, 6.67 అంగుళాల FHD+ డిస్‌ప్లే 5G ఫోన్ సేల్ ప్రారంభం.. ధర రూ.14,999

పోకో నుంచి ఈ వారంలో రెండు 5G స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్‌ అయ్యాయి. పోకో M7 ప్రో 5G, పోకో C75 5G స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. C75 5G హ్యాండ్‌సెట్‌ సేల్‌ నిన్న ప్రారంభం కాగా.. M7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ సేల్ ఇవాళ్టి నుంచి ప్రారంభం అయింది. ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ బడ్జెట్‌ రేంజ్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ 50MP సోనీ కెమెరా, 5110mAh బ్యాటరీను కలిగి ఉంది.

పోకో M7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ (Poco M7 Pro 5G Smartphone Sale) 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,999 మరియు 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.16,999 కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ హ్యాండ్‌సెట్‌ను SBI కార్డు, HDFC బ్యాంకు, ICICI బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేసి రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ ఫోన్‌ లావెండర్‌ ప్రోస్ట్‌, ఓలివ్‌ ట్విలైట్‌, లూనార్‌ డస్ట్‌ రంగుల్లో లభిస్తుంది.

Poco M7 Pro 5G Smartphone sale in india

పోకో M7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు :
పోకో M7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల FHD+ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ డిస్‌ప్లే 1080*2400 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, 2100 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్‌ 5 రక్షణను కలిగి ఉంది.

ఈ పోకో ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత HyperOS ను కలిగి ఉంది. మరియు మీడియాటెక్‌ డైమెన్సిటీ 7025 అల్ట్రా SoC ప్రాసెసర్‌ పైన పనిచేస్తుంది. ఈ ఫోన్‌ 45W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5110mAh బ్యాటరీతో పనిచేస్తుంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది.

కెమెరా విభాగం పరంగా ఈ పోకో బడ్జెట్‌ రేంజ్‌ ఫోన్ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను అమర్చి ఉంది. 1/1.95 అంగుళాల 50MP సోనీ LYT 600 ప్రైమరీ కెమెరా మరియు 2MP డెప్త్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ ముందువైపు కోసం 20MP సెల్ఫీ కెమెరాను అమర్చారు.

కనెక్టివిటీ పరంగా పోకో M7 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 5G, 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్‌ 5.3, GPS, GLONASS, 3.5mm ఆడియో జాక్‌, USB-C వంటి కనెక్టింగ్ ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ భద్రత కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను అమర్చారు. దీంతోపాటు మెరుగైన ఆడియో కోసం డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది.

మరో పోకో స్మార్ట్‌ఫోన్‌ C75 5G హ్యాండ్‌సెట్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.7999 గా ఉంది. ఈ హ్యండ్‌సెట్‌ 6.88 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత HyperOS, స్నాప్‌డ్రాగన్‌ 4s జెన్‌ 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 50MP కెమెరాను అమర్చారు. 5160mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Poco M7 Pro 5G Smartphone sale is live on flipkart in india features and price details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X