50MP సోనీ కెమెరా, అమోలెడ్ డిస్‌ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు కలిగిన 5G ఫోన్‌పై డిస్కౌంట్!
భారత్ మార్కెట్ లో పోకో సంస్థ అనేక మోడల్స్ ను లాంచ్ చేసింది. అయితే M7 సిరీస్ నుంచి గతంలో M7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ను (Poco M7 Pro 5G Smartphone) విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్ అమోలెడ్ డిస్‌ప్లే, 50MP కెమెరా, మీడియాటెక్ ప్రాసెసర్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది. విడుదల ధరతో పోలిస్తే ప్రస్తుతం డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది.
రూ.1500 వరకు డిస్కౌంట్ :
పోకో M7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో (Flipkart) కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14,999 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో రూ.13499 ధరకు కొనుగోలు చేయవచ్చు. సుమారుగా రూ.1500 తగ్గింపును పొందవచ్చు.

కలర్ వేరియంట్స్ :
అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.16999 ధరగా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో రూ.15499 ధరకు కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు. ఈ ఫోన్ లావెండర్ ఫ్రాస్ట్, లూనార్ డస్ట్, ఓలివ్ ట్విలైట్ కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది.
సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే :
పోకో M7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.67 అంగుళాల FHD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 2100 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ను కలిగి ఉంది. IP64 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంది.
మీడియాటెక్ చిప్‌సెట్, 4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ పోకో స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా SoC ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత Hyper OS పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుంది.
50MP సోనీ కెమెరా :
పోకో M7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఇందులో OIS ( ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ) సపోర్టుతో 50MP సోనీ LYT-600 ప్రైమరీ కెమెరా ఉంది. దీంతోపాటు 2MP మరో కెమెరా ఉంది. ముందు వైపు 20MP సెల్ఫీ కెమెరా ఉంది.
ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు :
బ్యాటరీ, ఛార్జింగ్ పరంగా ఈ హ్యాండ్‌సెట్ 5110mAh బ్యాటరీతో పనిచేస్తుంది. 45W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. డాల్బీ అట్మాస్ సపోర్టుతో స్టీరియో స్పీకర్ లు ఉన్నాయి. కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్ 5.3, వైఫై, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.


Click it and Unblock the Notifications