Home
Mobile

రూ.11499 ధరకే 45W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP సోనీ కెమెరా, ఫుల్‌ HD+ అమోలెడ్ డిస్‌ప్లే 5G స్మార్ట్‌ఫోన్‌!

భారత్‌లో గత సంవత్సరం డిసెంబర్ నెలలో పోకో సంస్థ బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ ను లాంచ్‌ చేసింది. పోకో M7 ప్రో 5G పేరుతో ( Poco M7 Pro 5G Smartphone ) అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ హ్యాండ్‌సెట్‌ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌, 50MP కెమెరా, సూపర్ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ ను డిస్కౌంట్ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ మూడు కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ పూర్తి స్పెసిఫికేషన్‌ లు, ఫీచర్ల వివరాలు.

రూ.3000 డిస్కౌంట్‌ :
పోకో M7 ప్రో 5G స్మార్ట్‌ ఫోన్‌ విడుదల సమయంలో 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.14,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.16999 ధరగా ఉండేది. ఫ్లిప్‌కార్ట్‌ లో ఈ ఫోన్‌ను రూ.3 వేల డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.

Poco M7 Pro 5G smartphone

రూ.11499 ధరకే 5G స్మార్ట్‌ఫోన్ :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ లో ఈ ఫోన్‌ ధరలు వరుసగా రూ.11499, రూ.13499 గా ఉంది. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై అదనపు తగ్గింపును పొందవచ్చు. ఈ పోకో హ్యాండ్‌సెట్ ఓలివ్‌ ట్విలైట్‌, లూనార్‌ డస్ట్‌, లావెండర్‌ ఫ్రాస్ట్‌ వంటి మూడు కలర్‌ వేరియంట్స్‌ లో అందుబాటులో ఉంది.

సూపర్‌ అమోలెడ్ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ :
పోకో M7 ప్రో 5G స్మా్ర్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.67 అంగుళాల FHD+ ( 1080 x 2400 పిక్సల్స్‌ ) సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 2100 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది. మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ ను పొందుతోంది.

50MP సోనీ కెమెరా, 20MP సెల్ఫీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో 50MP సోనీ LYT 600 ప్రైమరీ (OIS- ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) కెమెరాతోపాటు 2MP డెప్త్‌ సెన్సర్‌ తో అందుబాటులోకి వచ్చింది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 20MP కెమెరాను కలిగి ఉంది.

మీడియాటెక్‌ చిప్‌సెట్, ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టు :
ఈ పోకో ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7025 అల్ట్రా SoC ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఆం‌డ్రాయిడ్‌ 14 ఆధారిత HyperOS పైన పనిచేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 45W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5110mAh బ్యాటరీను కలిగి ఉంది.

డాల్బీ అట్మాస్‌ సపోర్టు :
ఈ హ్యాండ్‌సెట్ భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ ను అమర్చి ఉంటుంది. మెరుగైన ఆడియో సపోర్టు కోసం డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో స్టీరియో స్పీకర్‌ లను కలిగి ఉంది. 5G, 4G VoLTE, బ్లూటూత్‌ 5.3, Wi-Fi, GPS, USB-C ఛార్జింగ్‌ పోర్టు, 3.5mm ఆడియో జాక్‌ ఉన్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Poco M7 Pro 5G smartphone with 50MP sony Camera now available at Rs11499 Price on flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X