Home
Mobile

రూ.9000 కంటే తక్కువ ధరలో Poco 5G స్మార్ట్‌ఫోన్‌.. లాంచ్‌, స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు!

పోకో నుంచి త్వరలో రెండు స్మార్ట్‌ఫోన్‌లు (Poco India) లాంచ్‌ కానున్నాయి. C మరియు M సిరీస్‌ ఫోన్‌లు విడుదల కానున్నాయని పోకో తెలిపింది. ఈ వివరాలను పోకో ఇండియా హెడ్ హిమాన్షు టండన్‌ X (గతంలో ట్విట్టర్‌) ద్వారా ఈ వివరాలను వెల్లడించారు. పోకో M7 ప్రో 5G, పోకో C75 5G స్మార్ట్‌ఫోన్‌ల విడుదల తేదీ సహా స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు, ధర వివరాలను షేర్‌ చేశారు.

పోకో స్మార్ట్‌ఫోన్‌ల విడుదల తేదీ :
పోకో ఇండియా హెడ్‌ హిమాన్షు టండన్‌ X పోస్ట్‌ ఆధారంగా పోకో M7 ప్రో 5G, పోకో C75 5G స్మార్ట్‌ఫోన్‌లు (Poco C75 5G Smartphone) డిసెంబర్‌ 17 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్‌ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన లైవ్‌ పేజీ అందుబాటులో ఉంది.

Poco M7 Pro and C75 5G Smartphones launch date

పోకో M7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు! :
ఫ్లిప్‌కార్ట్‌ లిస్టింగ్ ఆధారంగా పోకో M7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ (Poco M7 Pro 5G Smartphone) 6.67 అంగుళాల పుల్‌ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 120Hz అడాప్టివ్ రీఫ్రెష్‌ రేట్, 2100 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 92.02 శాతం స్క్రీన్‌ టూ బాడీ రేషియోను కలిగి ఉండే అవకాశం ఉంది.

ఈ ఫోన్‌ డిస్‌ప్లే HDR 10+ సపోర్టు చేస్తుంది. TUV ట్రిపుల్ సర్టిఫికేషన్‌, SGC ఐ కేర్‌ సర్టిఫికేషన్‌ లను కలిగి ఉంటాయి. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరెల్లా గ్లాస్‌ 5 రక్షణను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ హ్యాండ్‌సెట్‌ల స్టోరేజీ, కలర్‌ వేరియంట్‌ల వివరాలు తెలియాల్సి ఉంది.

పోకో C75 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌ లు :
పోకో C75 5G స్మార్ట్‌ ఫోన్ వివరాలను ఫ్లిపికార్ట్‌ ద్వారా వెల్లడ‌య్యాయి. దీని ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్‌ వృత్తాకార కెమెరా మాడ్యూల్‌ ను కలిగి ఉంటుంది. వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది.

దీంతోపాటు ఇప్పటి వరకు వచ్చిన లీక్స్‌ ఆధారంగా పోకో C75 స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.88 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుందని సమాచారం.

ఈ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 4s జెన్‌ 2 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. 4GB ర్యామ్ సహా 4GB టర్బో ర్యామ్‌ను సపోర్టు చేస్తుంది. మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు స్టోరేజీని పెంచుకొనేందుకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు 18W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5160mAh బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉంది.

పోకో C75 5G స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ మార్కెట్‌లో రూ.9,000 కంటే తక్కువ ధరలో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ కేవలం 5G SA నెట్‌వర్క్‌ను మాత్రమే సపోర్టు చేస్తుంది. 5G NSA నెట్‌వర్క్‌ను సపోర్టు చేయదని తెలుస్తోంది. ప్రస్తుతం ఎయిర్‌టెల్‌ NSA నెట్‌వర్క్‌ను ఎయిర్‌టెల్‌ ఉపయోగిస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Poco M7 Pro and C75 5G Smartphones launch date revealed in india check specs and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X