Home
Mobile

3D కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, 6 సంవత్సరాల అప్‌డేట్స్‌, 50MP కెమెరాతో 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల..!

Poco M8 5G Smartphone : పోకో M8 5G స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ మార్కెట్లో విడుదల అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌, 3D కర్వడ్‌ డిస్‌ప్లే వంటి స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 50MP ప్రైమరీ కెమెరా, 20MP సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. రివర్స్‌ ఛార్జింగ్‌ను కూడా సపోర్టు చేస్తుంది. అయితే గత వేరియంట్‌తో పోలిస్తే కొత్త ఫోన్‌లో అనేక మార్పులను గమనించవచ్చు.

పోకో M8 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.77 అంగుళాల (1080 x 2392 పిక్సల్స్‌) 3D కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 3200 నిట్స్‌ పీక్ బ్రైట్‌నెస్‌, 387 ppi పిక్సల్‌ డెన్సిటి, 240Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే వెట్‌ టచ్‌ 2.0 సపోర్టును కలిగి ఉంది. ఫలితంగా తడిచేతులతోనూ వినియోగించుకోవచ్చు.

poco M8 5g smartphone launch news telugu

6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
పోకో స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 6 జెన్‌ 3 చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. ఈ చిప్‌ LPDDR4x ర్యామ్‌, 256GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత HyperOS 2.0 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ 4 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

50MP ప్రైమరీ, 20MP సెల్ఫీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 2MP లైట్‌ ఫ్యూజన్‌ 400 సెన్సర్‌ ఉన్నాయి. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ముందు వైపు 20MP కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరాలను 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తాయి.

పోకో M8 5G స్మార్ట్‌ఫోన్‌ 45W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5520mAh బ్యాటరీని కలిగి ఉంది. 18W రివర్స్‌ ఛార్జింగ్‌ ను కూడా సపోర్టు చేస్తుంది. 5 సంవత్సరాల వరకు మెరుగైన బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని చెబుతోంది. మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ SGS MIL STD 810 ను కలిగి ఉంది.

కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్ 5.1, వైఫై 5, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌ను కలిగి ఉంది. IP65 + IP66 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

పోకో M8 5G స్మార్ట్‌ఫోన్ ధర, సేల్‌ వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్‌ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.21999 గా ఉంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.22999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.24999 గా ఉంది.

ఈ ఫోన్‌ సేల్‌ జనవరి 13 వ తేదీన ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. సేల్‌ ప్రారంభం అయిన తొలి 12 గంటల్లో కొనుగోలు చేసిన యూజర్లకు రూ.15999 ధరకే ఈ ఫోన్‌ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఫ్రాస్ట్‌ సిల్వర్‌, గ్లేసియల్‌ బ్లూ, కార్బన్‌ బ్లాక్ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

Best Mobiles in India

English summary
poco M8 5g smartphone launched with 3D Curved Amoled Display, Snapdragon 6 gen 3 chip in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X