పోకో కొత్త స్మార్ట్‌ఫోన్ టీజర్ విడుదల.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల అంచనా వివరాలు..!
పోకో నుంచి ఇటీవలే భారత్ మార్కెట్ లోకి పోకో C85 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. బడ్జెట్ ధరలో అందుబాటులోకి వచ్చింది. అయితే తాజాగా పోకో ఇండియా కీలక వివరాలను వెల్లడించింది. పోకో M8 5G స్మార్ట్‌ఫోన్ విడుదల వివరాలను షేర్ చేసింది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్‌కు సంబంధించిన మైక్రోసైట్ లైవ్ లోకి వచ్చింది.
టీజర్ విడుదల :
పోకో ఇండియా తన M8 5G ఫోన్ కు (Poco M8 5G Smartphone) సంబంధించిన టీజన్ ను X హ్యాండిల్ ద్వారా షేర్ చేసింది. ఈ వీడియో ఆధారంగా ఈ ఫోన్ డ్యూయల్ టోన్ ఫినిష్ ను కలిగి ఉంది. స్క్వేర్ ఐలాంట్ కెమెరా మాడ్యూల్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ బ్లాక్ కలర్ వేరియంట్ లో లభిస్తుంది.

అంచనా వివరాలు :
పోకో M8 5G స్మా్ర్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌సెట్ ను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ చిప్ 8GB ర్యామ్, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుందని భావిస్తున్నారు. 45W ఛార్జింగ్ సపోర్టుతో 5520mAh బ్యాటరీతో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.
ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉంది :
ఈ ఫోన్ IP65 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుందని తెలుస్తోంది. ఇటీవల వచ్చిన కొన్ని రిపోర్టుల ఆధారంగా పోకో M8 5G స్మార్ట్‌ఫోన్.. జనవరి 6, 2026 వ తేదీన విడుదల కానున్న రెడ్‌మి నోట్ 15 ఫోన్‌కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా లాంచ్ కానుందని తెలుస్తోంది.
Power in your palm. Focus in every frame. POCO M8 5G doesn’t show up to compete; it shows up to finish. Designed to Slay. Coming soon. pic.twitter.com/fJSZmjuz4K
— POCO India (@IndiaPOCO) December 26, 2025
పోకో M8 5G స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లో ఎప్పుడు లాంచ్ కానుందనే వివరాలను వెల్లడించలేదు. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా 2026 జనవరిలో నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. త్వరలో మరిన్ని వివరాలు విడుదలయ్యే అవకాశం ఉంది.
పోకో C85 5G స్మార్ట్‌ఫోన్ :
ఇటీవల భారత్ మార్కెట్‌లో పోకో C85 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల అయింది. ఇటీవలే సేల్ కూడా ప్రారంభం అయింది. ఈ ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.11999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.12999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14499 గా ఉంది.
పోకో C85 5G స్మార్ట్‌ఫోన్ 6.9 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 810 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో అందుబాటులో ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS పైన పనిచేస్తోంది.
కెమెరా విభాగం పరంగా 50MP AI ప్రైమరీ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. రివర్స్ ఛార్జింగ్‌ను కూడా సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ IP64 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.


Click it and Unblock the Notifications








